Dry Fruits : మధుమేహంతో పోరాడటానికి ఏ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.. వేటిని తీసుకోకూడదు..!
ABN , Publish Date - Jun 28 , 2024 | 01:53 PM
డ్రైఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివీటీతో సహా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
శరీరంలో బలాన్ని నింపాలంటే అది ఆహారంతోనే సాధ్యం. సరైన ఆహారాన్ని ఎంచుకుంటే వ్యాధుల బారిన పడే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బలాన్నిచ్చే డ్రైఫ్రూట్స్ లలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది డయాబెటిక్ డైట్ తీసుకునే వారికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇవితీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరగడాన్ని నివారించవచ్చు. డ్రై ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు చాలా శ్రద్ధ వహించాలి. ఎందుకంటే అతిగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. వీటిని నేరుగా కాకుండా సమతుల్య ఆహారంలో భాగంగా చేర్చుకుని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు డ్రైఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
పోషక సాంద్రతను డ్రైఫ్రూట్స్ అందిస్తాయి. వీటిలోని విటమిన్లు, ఖనిజాలు, పీచుతో సహా అవసరమైన పోషకాలతో డ్రై ఫ్రూట్స్ నిండి ఉంటాయి. పోషకాలు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
డ్రైఫ్రూట్స్ లో ఉండే ఫైబర్ కంటంట్ కారణంగా జీర్ణక్రియ సవ్యంగా జరుగుతుంది. శరీరం పిండి పదార్థాలను బాగా గ్రహిస్తుంది.
బాదం, వాల్ నట్స్, పిస్తా వంటి వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి మోనోఅన్ శాచురేటెడ్, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వులతో సహా గుండె ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడంలో సహకరిస్తాయి.
యాంటీ ఆక్సిడెంట్లు..డ్రైఫ్రూట్స్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివీటీతో సహా ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తాయి.
వాల్ నట్స్.. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఇవి పనిచేస్తాయి.
Herbs And Spices : కిడ్నీ, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచే మూలికలు, సుగంధ ద్రవ్యాలు ఇవే..
బాదం.. ప్రోటీన్లు, పీచుపదార్థాలు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. బాదం రక్తంలో చక్కెర స్థాయిలను తక్కువ ప్రభావాన్ని చూపుతుంది.
పిస్తాలు.. తక్కువ కేలరీల కంటెంట్‌తో పిస్తాలు ప్రోటీన్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అందిస్తాయి. ఇవి మధుమేహం ఉన్నవారు తీసుకుంటే మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణను పొందవచ్చు.
చియా గింజలు.. చియా గింజలలో ఫైబర్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లతో నిండి ఉంటాయి.
ఏ డ్రైఫ్రూట్స్ మధుమేహం ఉన్నవారు తీసుకోకూడదు.
ఎండుద్రాక్ష.. ఫైబర్,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉన్నా కూడా ఇవి తింటే సహజ చక్కెర కారణంగా రక్తంలో చక్కెర పెరుగుతుంది.
Biotin Rich Foods : ఆరోగ్యకరమైన జుట్టు, చర్మం కోసం బయోటిన్ రిచ్ ఫుడ్స్ వీటిని తీసుకుంటే..
ఖర్జూరాలు.. వీటిలో పిండి పదార్థాలు అధికంగా ఉన్నాయి. ఇవి మధుమేహం ఉన్నవారు తీసుకుంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి.
ఎండిన మామిడి.. విటమిన్లు, మినరల్స్ ఉన్నాకూడా మామిడి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఎండిన పైనాపిల్.. ఎంజైమ్స్, పోషకాల కారణంగా సహజ చక్కెరలు ఎక్కువగా ఉండటం కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
Read Latest Navya News and Telugu News
గమనిక: పైన పేర్కొన్న వివరాలను ఆరోగ్య నిపుణులు అందించిన సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. దీనిని ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ధృవీకరించడం లేదు. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు పైన చెప్పిన సూచనలు పాటించాలి.