Share News

Kitchen : తియ్యగా..నోరూరించేలా..

ABN , Publish Date - Nov 02 , 2024 | 01:20 AM

తీపి అంటే అందరికీ ఇష్టమే. అలా అని ఎప్పుడూ తినే స్వీట్లు తింటే బోర్‌ కొడుతుంది.అలాంటప్పుడు ఇలా కాస్త వెరైటీగా వీటిని తయారుచేసుకుని రుచిచూస్తే సూపర్బ్‌ అనకుండా ఉండలేరు. మరి మీరూ ట్రై చేయండి.

Kitchen : తియ్యగా..నోరూరించేలా..

వంటిల్లు

తీపి అంటే అందరికీ ఇష్టమే. అలా అని ఎప్పుడూ తినే స్వీట్లు తింటే బోర్‌ కొడుతుంది.అలాంటప్పుడు ఇలా కాస్త వెరైటీగా వీటిని తయారుచేసుకుని రుచిచూస్తే సూపర్బ్‌ అనకుండా ఉండలేరు. మరి మీరూ ట్రై చేయండి.

  • ఆప్రికాట్‌ డిలైట్‌

  • కావలసిన పదార్థాలు

ఆప్రికాట్‌- 200గ్రాములు, బిస్కట్‌ క్రంబ్స్‌- 50 గ్రాములు, స్పాంజ్‌ క్రంబ్స్‌- 50 గ్రాములు, పాలు- 200 ఎంఎల్‌, పంచదార- 100 గ్రాములు, కస్టర్డ్‌ పౌడర్‌- 30గ్రాములు.

Untitled-1 copy.jpg11111.jpg

  • తయారీ విధానం

  1. ముందుగా ఆప్రికాట్స్‌ని వేడినీళ్లలో రెండు గంటలు నానబెట్టుకోవాలి.

  2. ఒక బౌల్‌లో పాలు తీసుకుని వేడి చేయాలి. 50 గ్రాముల పంచదార, కస్టర్‌ పౌడర్‌ని మరుగుతున్న పాలలో వేసి బాగా కలపాలి. కాసేపయ్యాక దింపి పక్కన పెట్టుకోవాలి.

  3. మరొక బౌల్‌లో నానబెట్టుకున్న ఆప్రికాట్‌లను స్టవ్‌పై పెట్టి వేడి చేయాలి. అందులో పంచదార వేసి, పాకం వచ్చాక దింపుకోవాలి.

  4. చల్లారిన తరువాత ఆప్రికాట్‌లను మిక్సీలో వేసి బ్లెండ్‌ చేయాలి.

  5. ఒక ట్రేలో ఆప్రికాట్‌ మిశ్రమాన్ని లేయర్‌లా వేయాలి. తరువాత దానిపై బిస్కట్‌ క్రంబ్స్‌, స్పాంజ్‌ క్రంబ్స్‌ని లేయర్‌గా వేసుకోవాలి. దానిపై కస్టర్డ్‌ మిల్క్‌ని పోయాలి. ఇదే విధంగా మరో లేయర్‌ చేయాలి.

  6. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా సర్వ్‌ చేసుకోవాలి.


తిరమిసు

  • కావలసిన పదార్థాలు

కోడిగుడ్లు- 5, పంచదార- పావుకేజీ, కాఫీ లిక్కర్‌- 15 ఎంఎల్‌, మస్కర్‌పోన్‌ చీజ్‌- 200 ఎంఎల్‌, వైట్‌ చాక్లెట్‌- 100ఎంఎల్‌, క్రీమ్‌- 200 ఎంఎల్‌, లేడీఫింగర్స్‌ - సరిపడా.

2222.jpg

  • తయారీ విధానం

  1. ఒక కప్పులో వేడి నీళ్లు తీసుకుని కొంచెం పంచదార, కాఫీ లిక్కర్‌ వేసి ఇన్‌స్టంట్‌ కాఫీ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి.

  2. ఒక బౌల్‌లో కోడిగుడ్డు పచ్చ సొన తీసుకుని కొద్దిగా పంచదార వేసి గిలక్కొట్టాలి. తరువాత వైట్‌ చాక్లెట్‌ను కలుపుకోవాలి.

  3. ఇప్పుడు మస్కర్‌పోన్‌ కలిపి మళ్లీ గిలక్కొట్టాలి. తరువాత క్రీమ్‌ వేసి కలియబెట్టి పక్కన పెట్టుకోవాలి.

  4. ఒక వెడల్పాటి ట్రేలో లేడీఫింగర్స్‌ (స్వీట్‌ స్పాంజ్‌ కేక్‌ బిస్కట్లు)ను వరుసగా పరుచుకోవాలి. దానిపై ఒక లేయర్‌లా మస్కర్‌పోన్‌ మిశ్రమాన్ని వేయాలి.

  5. తరువాత మరొకసారి లేడీఫింగర్స్‌ని వరుసగా పరుచుకోవాలి. దానిపై మరో లేయర్‌ మస్కర్‌పోన్‌ మిశ్రమాన్ని వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.

  6. సర్వ్‌ చేసుకునే ముందు కాఫీ పౌడర్‌తో గార్నిష్‌ చేసుకోవాలి.


సకోరా ఫిర్నీ

3333.jpg

  • కావలసిన పదార్థాలు

పాలు- ఒక లీటరు, బియ్యం- 100గ్రాములు, యాలకులు- 10గ్రాములు, పిస్తా పలుకులు- 10గ్రాములు.

  • తయారీ విధానం

  1. స్టవ్‌పై ఒక కడాయిపెట్టి పాలు పోసి మరిగించాలి.

  2. బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన తరువాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి.

  3. ఈ పొడిని పాలల్లో వేసి మరిగించుకోవాలి. చిక్కగా అవుతున్న సమయంలో పంచదార వేయాలి.

  4. యాలకుల పొడి వేసి దింపుకోవాలి.

  5. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లబడిన తరువాత పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసుకుని సర్వ్‌ చేయాలి.


  • షాహీ తుక్డా

Untitled-1 copy.jpg

  • కావలసిన పదార్థాలు

బ్రెడ్‌ ప్యాకెట్‌ ఒకటి, పంచదార- రెండు కేజీలు, నెయ్యి- ఒక కేజీ, యాలకుల పొడి- ఒక టీస్పూన్‌, బాదం పలుకులు- 100గ్రాములు, పిస్తా- 100 గ్రాములు, రబ్డీ- 500 గ్రాములు, నిమ్మకాయలు- రెండు.

  • తయారీ విధానం

  1. ముందుగా బ్రెడ్‌ని ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.

  2. తరువాత నిమ్మకాయ ముక్కలతో పంచదార పానకం తయారు చేసుకోవాలి.

  3. ఒక కడాయిలో నెయ్యి వేసి వేడి అయ్యాక బ్రెడ్‌ ముక్కలను గోల్డెన్‌ బ్రౌన్‌ రంగులోకి మారే వరకు వేయించుకోవాలి.

  4. ఇప్పుడు ఆ బ్రెడ్‌ ముక్కలను పంచదార పానకంలో వేయాలి. కాసేపయ్యాక తీసి ట్రేలో పెట్టుకోవాలి.

  5. ఆ బ్రెడ్‌ ముక్కలపై రబ్డీ పోయాలి. బాదం పలుకులు, పిస్తా పలుకులతో గార్నిష్‌ చేసుకోవాలి.

  6. ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లని షాహీ తుక్డా సర్వ్‌ చేసుకోవాలి.

Updated Date - Nov 02 , 2024 | 01:20 AM