Lifestyle: అగర్బత్తితో సువాసనే కాదు.. ఈ సూపర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి..!
ABN , Publish Date - Feb 26 , 2024 | 01:34 PM
Lifestyle: మన దేశంలో చాలా మంది ప్రజలు ఎక్కువ శాతం ధూపాన్ని వెలిగిస్తారు. దేవాలయంలో(Temple), ఇంట్లో(Home) పూజా సమయంలో ధూపం వెలిగించి హారతి ఇస్తారు. ఇందుకోసం అగర్‌బత్తీలను తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. వాస్తవానికి దైవారధన సమయంలో ధూపం వెలిగించి ఆరాధిస్తారు. కాలక్రమేణా.. సువాసన కోసం కూడా ప్రజలు ఉపయోగించడం..
Lifestyle: మన దేశంలో చాలా మంది ప్రజలు ఎక్కువ శాతం ధూపాన్ని వెలిగిస్తారు. దేవాలయంలో(Temple), ఇంట్లో(Home) పూజా సమయంలో ధూపం వెలిగించి హారతి ఇస్తారు. ఇందుకోసం అగర్‌బత్తీలను తరతరాలుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. వాస్తవానికి దైవారధన సమయంలో ధూపం వెలిగించి ఆరాధిస్తారు. కాలక్రమేణా.. సువాసన కోసం కూడా ప్రజలు ఉపయోగించడం మొదలుపెట్టారు. అయితే, ప్రజలు ఇంట్లో వెలిగించే అగర్‌బత్తీలు బహుముఖ ప్రయోజనాలు అందిస్తాయంటున్నారు నిపుణులు. అగర్‌బత్తీతో సువాసన రావడంతో పాటు.. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఒత్తిడిని తగ్గించడం, ఆందోళ నుంచి ఉపశమనం కలిగించడం, నిద్ర నాణ్యతను మెరుగుపరచడం, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం అనేక ఉపయోగాలు అగర్‌బత్తీ వలన కలుగుతాయని చెబుతున్నారు. సువాసనతో పాటు.. రోజువారీ జీవితంలో అగర్‌బత్తీ వలన కలిగే ప్రయోజనాలేంటో ఓసారి తెలుసుకుందాం..
మానసిక కల్లోలం: రోజూ 2 అగరుబత్తీలను వెలిగించడం వలన ఇంటి పరిసరాలు ఆహ్లాదకరంగా మారుతుంది. అందుకే.. అనాదికాలంగా ఉదయం, సాయంత్రం అగరబత్తులు వెలిగించడం ఆనవాయితీగా వస్తోంది. ధూపం కేవలం మతపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా సానుకూల భావాన్ని కలిగించడానికి కూడా వెలిగిస్తారు.
ధ్యానం, యోగా: ధూపం కేవలం మతపరమైన ప్రయోజనాల కోసం మాత్రమే కాకుండా ధ్యానం, యోగా అభ్యాసాలకు కూడా ఉపయోగిస్తారు. ధూపం వేయడం యోగా భంగిమలలో శక్తి ప్రవాహానికి సహాయపడుతుంది. చాలా మంది వ్యక్తులతో కలిసి పెద్ద ప్రదేశాల్లో యోగా చేస్తున్నప్పుడు.. ధూపాన్ని వెలిగించడం వల్ల సానుకూల మానసిక స్థితి ఏర్పడుతుంది.
అరోమాథెరపీ, శ్రేయస్సు: అగర్‌బత్తి అరోమాథెరపీలో సహాయపడుతుంది. అగర్‌బత్తీ నుంచి వెలువడే సువాసన మన శ్రేయస్సుకు సూక్ష్మంగా ప్రభావితం చేస్తుంది. కొన్ని సుగంధ ద్రవ్యాలు మనస్సు, శరీరానికి విశ్రాంతినిచ్చే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
మెరుగైన నిద్ర: పడుకునే ముందు 2 అగరుబత్తీలను వెలిగించడం వల్ల మీ గది తేలికపాటి సువాసనతో నిండిపోతుంది. మంచి రాత్రి నిద్ర కోసం మనస్సును తేలికపరుస్తుంది. ఇది ఉదయాన్నే రిఫ్రెష్‌గా, పునరుజ్జీవనం పొందడంలో సహాయపడుతుంది.
సృజనాత్మకత: సువాసన ఇంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా సృజనాత్మకతను ప్రేరేపిస్తుంది. ఆలోచనలో స్పష్టతను తీసుకువస్తుంది.