Mirchi Recipes : సై... సాలన్!
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:55 AM
చాలా మందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. బిర్యానీతో పాటుగా మిర్చి సాలన్ అంటే కూడా ఇష్టమే! అయితే ఈ సాలన్‌ను రకరకాలుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటి కొన్ని వంటలను చూద్దాం..
వంటిల్లు
చాలా మందికి హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. బిర్యానీతో పాటుగా మిర్చి సాలన్ అంటే కూడా ఇష్టమే! అయితే ఈ సాలన్‌ను రకరకాలుగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అలాంటి కొన్ని వంటలను చూద్దాం..
సఫేద్ మిర్చి కా సాలన్
కావాల్సిన పదార్థాలు
బజ్జీ మిర్చి- అర కిలో, జీలకర్ర- ఒక టేబుల్ స్పూను, నిమ్మరసం- నాలుగు టేబుల్ స్పూన్లు, నూనె- అరకప్పు, నువ్వుపప్పు- 100 గ్రాములు, ఎండు కొబ్బరి పొడి: 200 గ్రాములు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
బజ్జీ మిర్చిని సన్నగా తరగాలి. వాటి మధ్యలో ఉండే గింజలను తీసేయాలి.
నువ్వులు, కొబ్బరి పొడిలను మిక్సీలో వేసి కొద్దిగా నీళ్లు పోసి బాగా రుబ్బాలి.
ఒక మూకుడులో నూనె వేడి చేసి జీలకర్రను వేయించాలి. ఈ నూనెలో నువ్వులు, కొబ్బరి పొడి మిశ్రమాన్ని వేయాలి. కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. కొద్ది సేపటి తర్వాత నీళ్లు పైకి తేలుతూ ఉంటాయి.
ఆ సమయంలో తరిగిన మిర్చిని మిశ్రమంలో కలపాలి. మిర్చి ముక్కలు మెత్తగా అయిన తర్వాత స్టౌ మీద నుంచి కిందకు దింపాలి.
కొద్దిగా చల్లబడిన తర్వాత ఆ మిశ్రమంలో నిమ్మరసం వేసి కలపాలి.
జాగ్రత్తలు
వీలైనంత వరకు మార్కెట్లో లభించే బజ్జీ మిర్చి మాత్రమే వాడాలి. మామూలు మిర్చి వాడితే సరైన టేస్ట్ రాదు.
వీలైనంత వరకు ఎండు కొబ్బరి పొడినే వాడాలి. దీనివల్లమంచి రుచి వస్తుంది.
ఇది చపాతీలలోకి చాలా బాగుంటుంది.
2.ప్యాజ్ కీ ఘట్టికా సాలన్
కావాల్సిన పదార్థాలు
చుక్క కూర- ఐదు కట్టలు, సాంబారు ఉల్లిపాయలు- పావు కిలో, మామూలు ఉల్లిపాయ ముక్కలు- 100 గ్రాములు, టమోటా ముక్కలు- 100 గ్రాములు, అల్లం వెల్లులి పేస్ట్- ఒక టేబుల్ స్పూను, కారం- ఒక టేబుల్ స్పూను, పసుపు- అర టీ స్పూను, నూనె- అర కప్పు, ఉప్పు- తగినంత, నీళ్లు- తగినన్ని
తయారీ విధానం
చుక్క కూరను బాగా కడగాలి. ఆ తర్వాత ఆకులను విడదీసి సన్నగా
తరగాలి.
ఒక మూకుడులో నూనె తీసుకొని వేడి చేయాలి. ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలి.
ఆ ముక్కలకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను కలపాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పులను వేయాలి. ఆ మిశ్రమంలో సాంబారు ఉల్లిపాయలను వేసి మూత పెట్టాలి.
ఉల్లిపాయలు ఉడికిన తర్వాత- దానిలో తరిగిన చుక్కకూరను, టమోటా ముక్కలను వేయాలి.
దీనిలో తగినన్ని నీళ్లు పోసి బాగా ఉడకనివ్వాలి. సాంబారు ఉల్లిపాయలు పైకి తేలిన తర్వాత స్టౌ నుంచి కిందకు దింపేయాలి.
జాగ్రత్తలు
చుక్క కూరను ఉప్పు కలిపిన నీళ్లలో కడగాలి. అప్పుడు దానిపై ఉన్న మలినాలు, రసాయన పదార్థాలు తొలగిపోతాయి.
సాంబారు ఉల్లిపాయలు మృదువుగా ఉంటాయి. వాటిని ఎక్కువ సేపు మగనివ్వాల్సిన అవసరం ఉండదు.