Share News

Health : నొప్పికి నో...

ABN , Publish Date - Oct 08 , 2024 | 02:14 AM

కొందరు మహిళలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని కష్టంగా భరించాల్సిన అవసరం లేదు. కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి.

Health : నొప్పికి నో...

పిఎమ్‌ఎస్‌

కొందరు మహిళలకు నెలసరి నరకాన్ని చూపిస్తుంది. అయితే నెలసరి నొప్పిని కష్టంగా భరించాల్సిన అవసరం లేదు. కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి.

  • నొప్పి ఎందుకంటే?: నెలసరి నొప్పులకు కారణం ఆ సమయంలో శరీరంలో అసమతౌల్యానికి గురయ్యే హార్మోన్లే! హార్మోన్ల అసమతౌల్యానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. దీంతోపాటు పర్యావరణం, కాలుష్యం, విషాలు, ఒత్తిడి... నెలసరి నొప్పులను పెంచుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నొప్పులను తగ్గించే చిట్కాలు పాటించాలి. ఇందుకోసం...

  • వ్యాయామం: వ్యాయామం వల్ల కండరాలు వదులవుతాయి. మరీ ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

  • హీటింగ్‌ ప్యాడ్‌: నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్‌ ప్యాడ్‌తో కాపడం పెట్టినా ఫలితం ఉంటుంది.

  • వేడినీటి స్నానం: నెలసరిలో ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసినా కండరాలు రిలాక్స్‌ అయి, నొప్పులు తగ్గుతాయి.

  • కంటి నిండా నిద్ర: ఈ సమయంలో విశ్రాంతి మంచి ఫలితాన్నిస్తుంది. పగటివేళ కొద్దిసేపు కునుకు తీస్తూ ఉండాలి.

  • తక్కువ ఉప్పు: ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఉప్పు శరీరంలో నీరు నిలిచి ఉండేలా చేస్తుంది. దీంతో శరీరం బరువుగా తయారై అసౌకర్యం కలిగిస్తుంది.

  • మెగ్నీషియం, కాల్షియం: ఈ రెండు ఖనిజలవణాలు కండరాల బిగువు సడలేలా చేస్తాయి. కాబట్టి ఇవి పుష్కలంగా ఉండే ఆకు కూరలు, పాలు తీసుకోవాలి.

  • మంచి కొవ్వులు: కొబ్బరినూనె, వెన్నల్లో ఆరోగ్యానికి మేలు చేసే కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి.

  • ఇవి మానేయాలి: కెఫీన్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌.

Updated Date - Oct 08 , 2024 | 02:16 AM