Share News

Chandrababu Naidu: ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సేవలు మరువలేం..సముద్రాలు దాటొచ్చిన ప్రతి ఒక్కరికీ

ABN , Publish Date - May 15 , 2024 | 06:36 PM

ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణం కోసం విదేశాల్లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కలిక విరామం ప్రకటించి స్వదేశానికి వచ్చి తెలుగుదేశం కూటమి కోసం ఇటివల ఏపీ ఎన్నికల ప్రచారానికి(ap elections 2024) వచ్చిన ప్రవాసీయులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యన్. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు.

Chandrababu Naidu: ఎన్నికల్లో ఎన్ఆర్ఐల సేవలు మరువలేం..సముద్రాలు దాటొచ్చిన ప్రతి ఒక్కరికీ
Chandrababu Naidu nris

ఆంధ్రప్రదేశ్ పునర్మిర్మాణం కోసం విదేశాల్లో తమ ఉద్యోగాలు, వ్యాపారాలకు తాత్కాలిక విరామం ప్రకటించి స్వదేశానికి వచ్చి తెలుగుదేశం కూటమి కోసం ఇటివల ఏపీ ఎన్నికల ప్రచారానికి(ap elections 2024) వచ్చిన ప్రవాసీయులను తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు యన్. చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు. దీంతోపాటు సప్త సముద్రాలు దాటొచ్చి పోలింగ్‌లో పాల్గొన్న వారందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం రాత్రి ఘనంగా ఎన్ఆర్ఐ గ్రాట్యుటీ డిన్నర్ కార్యక్రమం నిర్వహించగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జూమ్ కాల్ ద్వారా పాల్గొని ఎన్ఆర్ఐల(NRIs) సేవలను కొనియాడారు.


విదేశాల్లోని ప్రవాసీయులు ప్రతి ఒక్కరు తమ వంతుగా ఏడాదికి అయిదుగురు యువకులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇచ్చి వీసా ఇప్పిస్తామని ముందుకు రావడం కీలక పరిణామమని చంద్రబాబు(Chandrababu) ప్రవాసీయులను మెచ్చుకున్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఎన్నారై విభాగం నుంచి విదేశాల నుంచి వచ్చి ప్రచారం చేసిన తీరును ఎన్నారై విభాగం అధ్యక్షుడు వేమూరి రవి వివరించారు. అభివృద్ధితో పాటు పార్టీ రాజకీయాలపై కూడ శ్రద్ధ పెట్టాలని అనేక మంది ప్రవాసీయులు చంద్రబాబును కోరగా అందుకు ఆయన స్పందించారు. ఇక నుంచి మీరందరు మారిన చంద్రబాబును చూస్తారని వ్యాఖ్యానించారు.


టీడీపీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చంద్రబాబు సీఎం(CM)గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విదేశాల నుంచి వచ్చిన ప్రవాసీయులు కలుసుకోవడానికి ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెడుతానని చంద్రబాబు చెప్పినట్లు గుర్తు చేశారు. సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు పార్టీ ప్రవాసీ ప్రముఖులు కోమటి జయరాం, వెంకట్ కోడూరి, సురేశ్ మాలపాటి, మల్లిక్ మేడరమట్ల, తదితరులు మాట్లాడారు. దీంతోపాటు గుంటూరు లోక్‌సభ అభ్యర్ధి పెమ్మసాని చంద్రశేఖర్‌తో పాటు గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ అసెంబ్లీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ పి.ఆశోక్ బాబు, నన్నపనేని రాజకుమారి, మన్నవ సుబ్బారావు, బ్రహ్మణ సాధికార సమితి అధ్యక్షులు బుచ్చిరాం ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.


ఇది కూడా చదవండి:

AP Politics: టియర్ గ్యాస్‌ ఎఫెక్ట్.. జేసీకి అస్వస్థత

AP News: పులివర్తి నానిపై జరిగిన దాడిని ఖండించిన గండి బాబ్జీ

Read Latest AP News And Telugu News

Updated Date - May 15 , 2024 | 06:41 PM