NRI news: జపాన్‌లో కార్తీక వన సమారాధన
ABN , Publish Date - Nov 27 , 2024 | 01:02 PM
తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్‌లోనూ వ్యాపించాయి.
గుంటూరు సిటీ: తెలుగు ప్రజలు ఎక్కడున్నా మన సంస్కృతి, సంప్రదాయాలకు పెద్ద పీట వేస్తూనే ఉంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి, ప్రతి కుటుంబం భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక వన సమాధారన సువాసనలు జపాన్‌లోనూ వ్యాపించాయి. జపాన్ దేశంలో నివాసం ఉంటున్న తెలుగు ప్రజలు టోక్యోలోని ఓజీమా ప్రాంతంలో కార్తీక వనసమాధారణ జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆటపాటలతో తెలుగు వారి ఐక్యతను చాటారు. కార్యక్రమం చివరల్లో పసందైన విందు భోజనంతో వన దేవతకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తెలుగు ప్రజలందరూ పాల్గొన్నట్లు జపాన్ తెలుగు అసోసియేషన్ నాయకులు తెలిపారు. జపాన్‌లో ఎన్నో సంవత్సరాలుగా అన్ని తెలుగు పండుగలనూ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన సంస్కృతి, సాంప్రదాయంతో పాటూ ప్రధానంగా పండుగ రోజు కనిపించే వస్త్రధారణ తమ ప్రాంతంలోని ప్రజలను అమితంగా ఆకట్టుకుంటాయని వారు తెలిపారు.