Home » Open heart with RK
మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టు ప్రజా వ్యతిరేకతకు గురి కాకముందే తాత్కాలికంగా పక్కన పెట్టాలని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ సూచించారు.
సీఎంగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేశాక ఏబీఎన్‌లో రెండో సారి బిగ్ డిబేట్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి వివరంగా సమాధానం ఇచ్చారు.
Open Heart With RK-Revanth Reddy: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్‌లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన వ్యక్తిగత వివరాల గురించి కీలక వివరాల చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన వ్యక్తిగత అభిరుచుల గురించి వెల్లడించారు.
మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణం నేపథ్యంలో నాడు రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్న కొణిజేటి రోశయ్య అనూహ్య పరిస్థితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆ నాటి పరిస్థితులను ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో రోశయ్య పంచుకున్నారు. గతంలో జరిగిన ఈ ఇంటర్వ్యూలో రోశయ్య ఏం మాట్లాడారంటే..
తాడూ బొంగరం లేని స్కిల్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి జైలులో నిర్బంధించిన నెల రోజుల తర్వాత కేంద్ర మంత్రి అమిత్ షా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ను కలుసుకున్నారు...
శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందట! మూడు రోజుల క్రితం నిజామాబాద్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం విన్న వారికి ఈ సామెత గుర్తుకు రావడం సహజం. తన వాక్చాతుర్యం, హావభావాలు, ఎత్తుగడలతో...
‘ఏపీలో పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉంది. రాష్ట్రమంటే అభివృద్ధి, పరిపాలన, ప్రజా జీవనం. ఆ వైభవమంతా ఇప్పుడు తుడిచిపెట్టుకుపోయింది’ అంటారు కవి, సినీ గేయ రచయిత, రాజకీయ నాయకుడు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు (Jonnavittula Ramalingeswara Rao). కవిగా పోరాటం చేయడం కష్టమని... అందుకే ఒక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకున్నానని చెబుతున్న జొన్నవిత్తుల... ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్‌హార్ట్ విత్ ఆర్కే’('Openheart with RK')లో మనసు విప్పి మాట్లాడారు.
తాడిపత్రి(Tadipatri) ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి( MLA Ketireddy Peddareddy) తాను లేని సమయంలో ఇంటికి వచ్చి కూర్చున్న సంఘటన తర్వాత ఉరేసుకుని చద్దామనుకున్నానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ సోదరుల్లో ఒకరైన ప్రభాకర్‌రెడ్డి (Prabhakar Reddy) వ్యాఖ్యానించారు.
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం
మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకెపుడు బయటకు వస్తారు? ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు.. తెలంగాణలో కూడా అనేక మంది నోటి నుంచి ఇదే ప్రశ్న వినిపిస్తోంది. నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల దుర్వినియోగం ..