TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్..

ABN, Publish Date - Mar 05 , 2024 | 12:41 PM

పుట్టపర్తి: పెనుకొండ సమీపంలోని కియ కార్ల పరిశ్రమ వద్ద సోమవారం టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన ‘రా.. కదలిరా’ సభకు పుట్టపర్తి పట్టణం నుంచి భారీగా తెలుగుతమ్ముళ్లు తరలివచ్చారు. అలాగే మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి స్థానిక సత్తెమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వందలాది వాహనాలతో తెలుగుతమ్ముళ్లతో కలిసి సభకు తరలి వెళ్లారు. తెలుగు యువత నాయకులు, కార్యకర్తలు పలు వాహనాల్లో ఎంతో ఉత్సాహంగా తరలివచ్చారు.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 1/7

పెనుకొండ నియోజకవర్గం, కియా కార్ల పరిశ్రమ సమీపంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు విచ్చేసిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న దృశ్యం. ప్రక్కన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలను చూడవచ్చు.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 2/7

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, కియా కార్ల పరిశ్రమ సమీపంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో ప్రసంగిస్తున్న టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 3/7

పెనుకొండ నియోజకవర్గం, కియా కార్ల పరిశ్రమ సమీపంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభలో టీడీపీ మైనారిటి సాంగ్‌ సీడీని లాంచ్ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు, ప్రక్కన ఎమ్మెల్యే బాలకృష్ణ, ఇతర టీడీపీ నేతలను చూడవచ్చు.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 4/7

పెనుకొండ నియోజకవర్గంలో జరిగిన రా కదలి రా సభలో తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి..చంద్రబాబుకు మెమెంటో అందజేసి నమస్కరిస్తున్న దృశ్యం.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 5/7

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, కియా కార్ల పరిశ్రమ సమీపంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభ వేదికపై ఆశీనులైన టీడీపీ అధినేత చంద్రబాబు, ఎమ్మెల్యే బాలకృష్ణ.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 6/7

టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభకు ధర్మవరం, చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భారీఎత్తున తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలు, అభిమానులు.

TDP: పెనుకొండలో చంద్రబాబు ‘రా కదలి రా’ సభ ఫోటోస్.. 7/7

శ్రీ సత్యసాయి జిల్లా, పెనుకొండ నియోజకవర్గం, కియా కార్ల పరిశ్రమ సమీపంలో జరిగిన రా కదలిరా బహిరంగ సభకు విచ్చేసిన ప్రజలకు అభివాదం తెలుపుతున్న నారా చంద్రబాబు నాయుడు.

Updated at - Mar 05 , 2024 | 12:41 PM