కుప్పంలో నారా భువనేశ్వరి పర్యటన
ABN, Publish Date - Dec 20 , 2024 | 11:54 AM
చిత్తూరు జిల్లా: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి.. నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం చిత్తూరు జిల్లా కుప్పంకు వచ్చారు. అందులో భాగంగా గురువారం కుప్పంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో అదనపు కోర్సులను ప్రారంభించారు. అభివృద్ధిలో కుప్పం నియోజకవర్గాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు తరఫున మహిళలకు ఆర్థిక చూయూత అందిస్తామని తెలిపారు. కుప్పం ఏరియా ఆస్పత్రిలో త్వరలో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్నారు.
Updated at - Dec 20 , 2024 | 11:54 AM