డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్

ABN, Publish Date - Oct 22 , 2024 | 11:59 AM

విజయనగరం జిల్లా: బలిజిపేట మండలం పెద్దపెంకిలో బోద వ్యాధి వ్యాప్తి చెందకుండా చర్యలు చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశించారు. సోమవారం విజయనగరం జిల్లా, గుర్ల మండలంలో డయేరియా బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం విజయనగరం కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షించారు. బోద వ్యాప్తి చెందకుండా పరిసరాల పరిశ్రుభత, ఇతర ఆరోగ్య పరిస్థితులపై చర్యలు చేపట్టాలన్నారు. ఏప్రిల్‌ నెల నుంచి విస్తృతంగా పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నామని, ఫాగింగ్‌ కూడా నిర్వహిస్తున్నామని కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ తెలిపారు. రక్షిత పథకాల వద్ద క్లోరినేషన్‌ చేస్తున్నామన్నారు.

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 1/6

విజయనగరం గుర్ల పీహెచ్‌లో డయేరియా బాధితులను పరామర్శించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 2/6

డయేరియాకు సంబంధించి రోగుల వివరాలను డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్...

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 3/6

డయేరియాతో చికిత్స పొందుతున్న ఓ పేషెంట్ వద్దకు వెళ్లి ఆమెతో మాట్లాడుతున్న జనసేనాని...

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 4/6

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను శాలువ కప్పి సన్మానిస్తున్న విజయనగరం జిల్లాల నేతలు..

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 5/6

విజయనగరం, గుర్ల పీహెచ్‌లో డయేరియా బాధితులను పరామర్శించిన అనంతరం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

డయేరియా బాధితులను పరామర్శించిన పవన్ కల్యాణ్ 6/6

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వికలాంగుల సమస్యలను తెలుసుకుని వారి నుంచి అర్జీలు స్వీకరిస్తున్న దృశ్యం..

Updated at - Oct 22 , 2024 | 11:59 AM