Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు

ABN, Publish Date - Sep 17 , 2024 | 04:47 PM

భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతోంది. నగరంలో అతి ముఖ్యమైన ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 1/7

భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన కార్యక్రమం కన్నుల పండుగగా కొనసాగుతోంది. నగరంలో అతి ముఖ్యమైన ఖైరతాబాద్ మహాగణపతి, బాలాపూర్ గణేషుడి నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా ముగిసింది. మిగతా వినాయక విగ్రహాల నిమజ్జనం కూడా కొనసాగుతోంది.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 2/7

ఈ ఏడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక లక్షా నలభై వేల గణేషుడి విగ్రహాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు అంచనా వేశారు.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 3/7

ఇప్పటికే 40 వేల వినాయక విగ్రహాల నిమజ్జనం పూర్తయ్యింది. ఇవాళ లక్షల విగ్రహాల నిమజ్జనం జరుగనుంది.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 4/7

మిగతా విగ్రహాల నిమజ్జన కార్యక్రమం ఇవాళ జరుగుతోంది. రాష్ట్రంలోనే ఎంతో కీలకమైన ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం మంగళవారం మధ్యాహ్నం 1-2 మధ్యల పూర్తయ్యింది.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 5/7

మరో ప్రముఖ వినాయకుడు.. బాలాపూర్ గణేషుడి నిమజ్జనం కూడా హుస్సేన్ సాగర్‌లోనే జరిగింది. సాయంత్రం 4:30 సమయంలో బాలాపూర్ గణపతి గంగమ్మ ఒడికి చేరాడు.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 6/7

వినాయక విగ్రహాల దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే మల్లుతున్నాయి. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాలు సాగర తీరానికి తరలి వస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవాళ 50 వేలకు పైగా వినాయక విగ్రహాలు నిమజ్జనం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Ganesh Immersion in Hyderabad: కన్నుల పండుగగా గణేష్ నిమజ్జనాలు 7/7

గణనాథుల నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు నగరం నలుమూలల నుంచే కాదు.. రాష్ట్ర నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ పరిసరాలకు తరలి వచ్చారు. దీంతో ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్ పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Updated at - Sep 17 , 2024 | 04:49 PM