పగ తీర్చుకున్న సిరాజ్ మియా

ABN, Publish Date - Dec 18 , 2024 | 04:07 PM

తనను గెలికిన కంగారూలకు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 1/9

టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటాడు. గ్రౌండ్ బయట కూల్‌గా ఉన్నా..

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 2/9

బరిలోకి దిగితే మాత్రం తనలోని అగ్రెషన్‌ను బయటకు తీస్తాడు. నిప్పులు చెరిగే బంతుతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తాడు

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 3/9

గబ్బా టెస్ట్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లను భయపెట్టి ఔట్ చేశాడు సిరాజ్.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 4/9

మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్నాడు మియా. ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్‌ ఆటకట్టించాడు.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 5/9

పింక్ బాల్ టెస్ట్‌లో తనను తిట్టిన హెడ్‌తో పాటు ఎప్పుడూ సవాల్ విసిరే స్మిత్‌ కథ ముగించాడు.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 6/9

భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు గడగడలాడింది. 89 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 7/9

సిరాజ్ (2/36)తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా (3/18), ఆకాశ్‌దీప్ (2/28) కూడా బుల్లెట్ పేస్‌తో కంగారూలకు పోయించారు.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 8/9

వంద లోపే ఆలౌట్ అయితే పరువు పోతుందని భావించిన ఆసీస్.. ఇన్నింగ్స్‌ను 89 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది.

పగ తీర్చుకున్న సిరాజ్ మియా 9/9

275 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రోహిత్ సేన ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులతో ఉంది.

Updated at - Dec 18 , 2024 | 07:34 PM