Share News

YSRCP: ఒక ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్.. సడన్‌గా ఇలా జరగడంతో..!?

ABN , Publish Date - Mar 08 , 2024 | 09:23 AM

AP Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి..

YSRCP: ఒక ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చిన వైఎస్ జగన్.. సడన్‌గా ఇలా జరగడంతో..!?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల (AP Elections) ముందు చిత్రవిచిత్రాలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అటు అధికార వైసీపీలో (YSR Congress) .. ఇటు టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమిలో ఎప్పుడేం జరుగుతుందో.. ఎలాంటి ప్రకటనలు వస్తాయో తెలియని పరిస్థితి. ఏం చేసినా.. ఎన్ని చేసైనా సరే రెండోసారి అధికారం దక్కించుకోవాలని వైసీపీ అడ్డదారులు తొక్కుతుంటే.. సమస్యే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ జగన్ (YS Jagan) రెండోసారి ముఖ్యమంత్రి కానివ్వమని.. ఇప్పటికే ఏపీ సర్వనాశనం అయ్యిందని కూటమి చెబుతోంది. ఇందుకోసం చాలా వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తోంది. దీంతో ఒకింత కంగుతిన్న జగన్.. ఇప్పటి వరకూ ప్రకటించిన అభ్యర్థులను సైతం మార్చే పనిలో పడ్డారు. ఇప్పటికే ఒకరిద్దరు అభ్యర్థులను మార్చిన అధినేత.. తాజాగా ఒక ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిని అటు ఇటు తారుమారు చేశారు.

Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!



YS Jagan Sad.jpg

ఇదిగో ఇదీ అసలు సంగతి..

అవనిగడ్డ అసెంబ్లీ, మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గాల అభ్యర్థులను వైసీపీ అధిష్టానం తారుమారు చేసింది. అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌ను మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా మార్పు చేసింది. తొలుత అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రకటించింది. కారణాలు ఏవైతేనేం అభ్యర్థిని మార్చాల్సి వచ్చింది. గురువారం సాయంత్రం తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే పేర్ని నాని మాట్లాడుతూ.. చంద్రశేఖర్‌ను ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నిర్ణయించినట్టు తెలిపారు.


Simhadri-Ramesh-And-Ramesh.jpg

ఎవరీ ఇద్దరు..?

డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌రావు తండ్రి సింహాద్రి సత్యనారాయణరావు మూడుసార్లు అవనిగడ్డ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పని చేశారని, మచిలీపట్నంతో డాక్టర్‌ సింహాద్రి చంద్రశేఖర్‌, వారి కుటుంబానికి విడదీయలేని అనుబంధం ఉందని, 35 ఏళ్లుగా ఆయన అంకాలజిస్ట్‌గా ప్రజలకు వైద్య సేవలందించారని చెప్పారు. చంద్రశేఖర్‌ మాట్లాడుతూ తనను అవనిగడ్డ నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలని అవకాశమిచ్చారని, తాను అసెంబ్లీకి పోటీ చేయనని చెప్పానని, సీఎం జగన్మోహన్‌రెడ్డి స్వయంగా తనను పిలిపించి ఎంపీగా పోటీ చేయాలని కోరారని చెప్పారు. కాగా.. అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా సిటింగ్‌ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబును నియమిస్తూ ఆ పార్టీ గురువారం ప్రకటన జారీ చేసింది. మచిలీపట్నం పార్లమెంటు అభ్యర్థి చంద్రశేఖర్‌, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త రమేష్‌బాబు ఒకే అవనిగడ్డ నియోజకవర్గంవారే కాక ఒకే గ్రామం అయిన బందలాయిచెరువుకు చెందివారు. వైసీపీ హైకమాండ్ సడన్‌గా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆయా నియోజకవర్గ కార్యకర్తలు ఒకింత ఆందోళన చెందుతున్న పరిస్థితి.

YSRCP-To-TDP-Flags.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 09:23 AM