Share News

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

ABN , Publish Date - Feb 09 , 2024 | 07:35 PM

AP Politics: అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి...

AP Elections 2024: చంద్రబాబు వెళ్లొచ్చాక ఢిల్లీలో మారిన సీన్.. స్వయంగా రంగంలోకి మోదీ!

అవును.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrabau Naidu) ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన తర్వాత హస్తిన వేదికగా శరవేగంగా రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి. ఢిల్లీకి రండి ‘పొత్తు’పై మాట్లాడుకుందామని స్వయంగా కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా (Amit Shah) నుంచి ఫోన్ రావడం.. చంద్రబాబు వెళ్లి చర్చించడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. ఢిల్లీలోనే దాదాపుగా పొత్తులు, బీజేపీకి ఇచ్చే సీట్ల గురించి క్లారిటీ వచ్చేయడం.. హస్తిన నుంచి రాగానే త్యాగాలకు సిద్ధంగా ఉండాలని టీడీపీ నేతలు, కేడర్‌కు చంద్రబాబు పిలుపునివ్వడం కూడా జరిగిపోయింది. అంతేకాదు.. బీజేపీకి (BJP) ఇచ్చే సీట్ల విషయంపై మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కూడా బాబు చర్చించారు. ఇప్పటికే జనసేనకు ఎన్ని సీట్లు ఇవ్వాలనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఒకట్రెండు రోజుల్లో బీజేపీకి కేటాయించే స్థానాలపై కూడా లెక్కలు తేలిపోనున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చాక చంద్రబాబు ఇదే పనిలో నిమగ్నమయ్యారు.


Chandrababu-Delhi-Tour.jpg

ఇదీ ఢిల్లీలో సీన్..!

ఇటు ఏపీలో.. చంద్రబాబు సీట్ల లెక్కల్లో ఉండగా.. అటు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) స్వయంగా రంగంలోకి దిగిపోయారు. టీడీపీ తమ మిత్రపక్షమేనని భావించి ఆ పార్టీ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించడం, విందులు ఇవ్వడం చేసేస్తున్నారు. శుక్రవారం నాడు పార్లమెంట్‌లో మోదీ విందు ఏర్పాటు చేశారు. ఈ లంచ్‌కు 8 మంది ఎంపీలు విచ్చేయగా.. ఇందులో ఒకరు టీడీపీ ఎంపీ, యువనేత రామ్మోహన్ నాయుడు (Kinjarapu Ram Mohan Naidu) ఉన్నారు. స్వయంగా మోదీనే రామ్మోహన్‌ను ఆహ్వానించడంతో.. ఢిల్లీలో పరిస్థితులు మారిపోతున్నాయని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అమిత్ షాతో చంద్రబాబు భేటీ జరిగిన మరుసటిరోజే ఈ పరిణామం జరగడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ విందుకు సంబంధించి ఫొటోలను ట్విట్టర్ వేదికగా రామ్మోహన్ నాయుడు పంచుకున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడీ ఫొటోల గురించే పెద్ద చర్చ జరుగుతోంది. ఇక ఏపీ రాజకీయాల్లో అయితే.. ఏ ఇద్దరు నేతలు కలిసినా చంద్రబాబు హస్తిన పర్యటన, మోదీ విందు గురించే చర్చించుకుంటున్నారంటే పరిస్థితులు ఎలా మారిపోయాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.


Rammohan.jpg

ఇంకా ఎవరెవరు ఉన్నారు..?

కాగా.. మోదీ ఇచ్చిన విందుకు (Modi Party) బీజేపీ ఎంపీలు హీనా గవిత్, ఎస్. ఫాంగ్నాన్ కొన్యాక్, జమ్యాంగ్ త్సెరింగ్ నమ్‌గ్యాల్, ఎల్ మురుగన్, బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్రలతో పాటు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు ఉన్నారు. వీరందరితో కలిసి మోదీ పార్లమెంట్ క్యాంటిన్‌లో భోజనం చేశారు. ఈ ఎంపీలందరినీ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకే మోదీ ఆహ్వానించారు. ‘మీకు ఈ రోజు శిక్ష విధిస్తా... నాతో కలిసి లంచ్ చేయడమే మీకు ఈ రోజు శిక్ష’ అంటూ ఎంపీలతో ముచ్చట్లు చెప్పుకుంటూ మోదీ లంచ్ చేశారు. క్యాంటీన్‌లో శాకాహార భోజనం, రాగి లడ్డూలను మోదీ, ఎంపీలు తిన్నారు. చూశారుగా.. ఇదీ మోదీ విందు కహానీ. మొత్తానికి చూస్తే.. చంద్రబాబు పర్యటన తర్వాత ఢిల్లీ వేదికగా శరవేగంగా పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పడానికి ఇదొక చక్కటి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. మున్ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ సీన్‌లు ఇంకెన్ని చోటుచేసుకుంటాయో చూడాలి మరి.

Rammohan-Naidu.jpg

మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి

AP Politics: వైసీపీ ఎంపీ మాగుంటను ఘోరంగా అవమానించిన సీఎం జగన్.. సాయన్నా ఏంటిది..?


TS Politics: పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌‌కు బిగ్ షాక్.. సినిమా మొదలైనట్టే..?


AP Elections 2024: వైఎస్ జగన్‌కు దిమ్మతిరిగే షాక్.. టీడీపీదే అధికారమని తేల్చేసిన ఇండియా టుడే సర్వే



Updated Date - Feb 09 , 2024 | 07:49 PM