AP Election 2024: అనపర్తి నియోజకవర్గంలో మలుపు తిరుగుతున్న రాజకీయం!
ABN , Publish Date - Mar 30 , 2024 | 04:29 PM
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Assembly) సమీపిస్తున్నా రాజకీయ వేడి మరింత రంజుగా మారుతోంది. అధికార పక్షం వైసీపీ ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఎన్డీయే కూటమి ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ప్రకటించిన సీట్ల విషయంలో అక్కడక్కడా నేతల అలకలు, అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజవకర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.
అమరావతి: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Assembly Elections) సమీపిస్తున్నా రాజకీయ వేడి మరింత రంజుగా మారుతోంది. అధికార పక్షం వైసీపీ ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఎన్డీయే (NDA) కూటమి ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ప్రకటించిన సీట్ల విషయంలో అక్కడక్కడా నేతల అలకలు, అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజవకర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడ రాజకీయం మలుపుతిరుగుతోంది. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి (BJP) కేటాయించడంతో ఆ పార్టీ శివరామకృష్ణం రాజును (Nallamilli ShivaRama krishnam Raju) అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో టికెట్ ఆశించిన టీడీపీ (TDP) నేత, మాజీ ఎమ్మెల్యే భంగపాటుకు గురయ్యారు. అయితే శనివారం ఆసక్తిరమైన పరిణామాలు చోటుచేసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి.
అనపర్తిలో రాజకీయ మలుపు!
అనపర్తి స్థానాన్ని బీజేపీకి కేటాయించడం, ఆ పార్టీ అక్కడ అభ్యర్థిని ప్రకటించడంతో టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వర్గం అసంతృప్తికి గురయ్యింది. టికెట్ దక్కకపోవడంతో మనస్థాపానికి గురైన ఆయన కార్యకర్తల సమక్షంలోనే కంటతడి కూడా పెట్టుకున్నారు. మరోవైపు బీజేపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించినప్పటికీ అక్కడ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. నియోజకవర్గంలో రంగంలోకి దిగిన ఆర్‌ఎస్ఎస్ బృందాలు.. క్షేత్రస్ధాయి పరిస్ధితిని నివేదిక రూపంలో హైకమాండ్‌కు పంపించాయి. దీంతో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం టీడీపీ నాయకుడు నల్లమిల్లి రామకృష్ణా నివాసానికి బీజేపీ కేంద్ర కమిటీకి చెందిన ఓ మహిళా నేత వెళ్లారు. నల్లమిల్లి కుటుంబ సభ్యులతో చర్చలు జరిపిన ఆమె.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా? అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది.
అయితే తాను ప్రజల ఆదేశాలు మేరకే నడుచుకుంటానని సదరు బీజేపీ నేతకు నల్లమిల్లి కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. మరి బీజేపీ అభ్యర్థిత్వం ఖరారు చేస్తే తమ పార్టీ నుంచి పోటీ చేస్తారా అని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీని వదిలి వేరే పార్టీలో చేరే ఉద్దేశం తనకు లేదని నల్లమిల్లి కుటుంబ సభ్యులు కుండబద్ధలుకొట్టినట్టుగా తెలిసింది.
ఇవి కూడా చదవండి
Pawan Kalyan: వర్మతో పవన్ కల్యాణ్ భేటీ.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ
AP Politics: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 9 గ్యారెంటీలు అమలు
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి