Home » Nallamilli Ramakrishna Reddy
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తుల తగాదాలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అంతా ఇదే విషయం నడుస్తోంది. వారసత్వ హక్కుగా రావాల్సిన ఆస్తిని చెల్లికి దక్కకుండా జగన్ వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అనపర్తి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallamilli Ramakrishna Reddy) బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అరుణ్ సింగ్, సిద్ధార్థ నాథ్ సింగ్, దగ్గుబాటి పురందేశ్వరి కాషాయం కండువా కప్పారు. టీడీపీ నుంచి అనపర్తి సీటును నల్లమిల్లి ఆశించిన విషయం తెలిసిందే. తెలుగుదేశం - బీజేపీ - జనసేన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
తెలుగుదేశం పార్టీలో దెందులూరు, తంబళ్లపల్లె అసెంబ్లీ స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతొంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తితో ఈ రెండు స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక ముడిపడి ఉందని తెలుస్తోంది. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జీ బీజేపీలో చేరి పోటీ చేసేందుకు అంగీకరించారు.
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. గెలుపు కోసం అన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఏ నియోజకవర్గంలో గెలుపు ఈజీ.. ఎక్కడ కష్టపడాలో లెక్కలు వేసుకుంటున్నారు. ప్రత్యర్థి కొంచెం వీక్‌గా ఉంటే మన గెలుపు పక్కా అనుకుంటున్నారు. ఈలోపు ప్రత్యర్థి పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. మన మైనస్‌లు అవతల పార్టీకి ప్లస్‌లు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. అలాంటి నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి ఒకటి. పొత్తులో భాగంగా ఈ సీటును బీజేపీకి కేటాయించారు.
Andhra Pradesh Assembly Elections: అనపర్తి(Anaparthi) ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై చిక్కుముడి వీడింది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి(Nallamilli Ramakrishna Reddy) బీజేపీ(BJP) నుంచి పోటీ చేసేందుకు అంగీకారం తెలిపారు. తొలుత తాను టీడీపీ(TDP) నుంచి మాత్రమే పోటీ చేస్తానని నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి..
అనపర్తి టికెట్ విషయంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి(Purandeswari)తో చర్చించినట్లు అనపర్తి టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి (Nallimilli Rama Krishna Reddy) తెలిపారు. శనివారం నాడు దగ్గుబాటి పురందేశ్వరి - వెంకటేశ్వరరావు దంపతులతో సమావేశం అయినట్లు తెలిపారు.
అనపర్తి అసెంబ్లీ టికెట్ బీజేపీకి కేటాయించడాన్ని నియోజకవర్గ టీడీపీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ క్రమంలో టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికలు-2024 (AP Assembly) సమీపిస్తున్నా రాజకీయ వేడి మరింత రంజుగా మారుతోంది. అధికార పక్షం వైసీపీ ఇప్పటికే అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. ఎన్డీయే కూటమి ఒకటి రెండు చోట్ల అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక ప్రకటించిన సీట్ల విషయంలో అక్కడక్కడా నేతల అలకలు, అసంతృప్తులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజవకర్గంలో ఇదే పరిస్థితి నెలకొంది.
అనపర్తిలో తెలుగుదేశం పార్టీ ఉనికిని ప్రమాదంలో పడేసింది మీరేనని.. ఇప్పుడు అక్కడ పార్టీని కాపాడుకోవాల్సింది కూడా మీరేంటూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఎదుట ఆ నియోజకవర్గ ఇన్చార్జీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తోంది.
ఏపీ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. అయితే పొత్తుల్లో భాగంగా కొంతమంది సీనియర్ నేతలకు టీడీపీ(TDP) టికెట్లు కేటాయించలేకపోతోంది. ఎంతోకాలంగా పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు టికెట్లు ఇవ్వమంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. కొంతమంది కీలక నేతలు హై కమాండ్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి టికెట్ బీజేపీకి కేటాయించారు.