Share News

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

ABN , Publish Date - Jun 22 , 2024 | 09:49 PM

టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు...

Chandrababu: అమిత్ షా ఫోన్.. అవసరం లేదన్న చంద్రబాబు!

అమరావతి: టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu) కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ స్పీకర్ విషయంలో ఢిల్లీలో పెద్ద హడావుడే నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. లోక్ సభ స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నుంచి చంద్రబాబుకు ఫోన్ వచ్చింది. ఆ ఫోన్‌ సారాంశాన్ని ఈ సమావేశంలో భాగంగా సీఎం పంచుకున్నారు. ‘ స్పీకర్ ఎన్నికపై అమిత్ షా.. నాకు ఫోన్ చేశారు. టీడీపీకి అవసరం లేదని చెప్పేశాను. రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని చెప్పాను. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది.. ఆదుకోవాలని కోరాను. ఏపీ ప్రజలు కూటమిని నమ్మి అధికారం ఇచ్చారు’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

యంగ్ ఎంపీలకు సీఎం చంద్రబాబు అరుదైన అవకాశం..!


Chandrababu-Naidu.jpg

అమరావతి, పోలవరం!

మనం పదవులు కోసం అడిగితే రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతింటాయి. మనకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎంపీలకు ఒక్కొకరికి మూడు శాఖలు కేటాయిస్తాను. మీరు ఆయా శాఖల్లో నిధులు, పథకాలను రాష్ట్రానికి తీసుకొని రావాలి. శాఖలు కేటాయించిన ఎంపీలు, రాష్ట్రంలోని సంబధిత మంత్రులతో మాట్లాడుకుని సమన్వయం చేసుకోవాలి. లోక్‌సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలి. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతీ ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలిఅని చంద్రబాబు సూచించారు. మరీ ముఖ్యంగా.. పోలవరం, అమరావతి గురించి సమావేశంలో పదే పదే చంద్రబాబు ప్రస్తావించారు. వీటి నిర్మాణం కోసం వేగంగా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ మధ్యనే AP అంటే.. అమరావతి, పోలవరం అని చంద్రబాబు స్వయంగా చెప్పిన సంగతి తెలిసిందే. అందుకే.. రాష్ట్రానికి ఈ రెండే ముఖ్యమని తొలి ప్రాధాన్యత వీటికే ఇస్తున్నారు.


అరుదైన అవకాశం..!

ఇదే సమావేశంలో ..టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా లావు శ్రీకృష్ణ దేవరాయలును చంద్రబాబు ఎంపిక చేశారు. ఇక డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నంద్యాల నుంచి తొలిసారి ఎంపీగా గెలిచిన బైరెడ్డి శబరికి అవకాశం కల్పించారు. కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్‌ను నియమించడం జరిగింది. శనివారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ సమావేశం జరిగింది. సుమారు రెండు గంటలసేపు కొనసాగిన ఈ సమావేశంలో.. మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశంలో పార్లమెంటరీ పార్టీ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను ఎన్నుకోవడం జరిగింది. ఈ నెల 24 నుంచి ప్రారంభమయ్యే లోక్‌సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై లోతుగా చర్చించడం జరిగింది.

వైసీపీ ఘోర ఓటమికి ఒక్క మాటలో కారణం చెప్పిన కేకే సర్వే


మరిన్ని రాజకీయ కథనాల కోసం క్లిక్ చేయండి..


Updated Date - Jun 22 , 2024 | 09:49 PM