Share News

TS Politics : రేవంత్ సర్కార్ వచ్చిన నెలరోజుల్లోనే ఊహించని రీతిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. ఎందుకిలా..?

ABN , Publish Date - Jan 03 , 2024 | 09:58 PM

Telangana Govt Transfers IAS And IPS Officials : అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌, ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే..

TS Politics : రేవంత్ సర్కార్ వచ్చిన నెలరోజుల్లోనే ఊహించని రీతిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు.. ఎందుకిలా..?

అవును.. ఊహించిన విధంగానే తెలంగాణలోని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి ఐఏఎస్‌, ఐపీఎస్‌లను భారీగా బదిలీ చేసింది. బుధవారం నాడు 26 మంది టాప్ ఐఏఎస్‌ అధికారులను బదిలీ చేసి కొత్త పోస్టింగ్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. సీన్ కట్ చేస్తే కొన్ని గంటల వ్యవధిలోనే 23 మంది ఐపీఎస్‌లను రేవంత్ సర్కార్ బదిలీ చేసింది. ఇందులో టెక్నికల్‌ సర్వీసెస్‌ అదనపు డీజీగా వి.వి.శ్రీనివాసరావు, డీఐజీ కోఆర్డినేషన్‌గా గజారావు భూపాల్, ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీగా రెమారాజేశ్వరీలు కూడా ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే ఈ రేంజ్‌లో బదిలీలు, కొత్త పోస్టింగ్‌లు ఇవ్వడం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడటం.. త్వరలో 2024 లోక్‌సభ ఎన్నికలకు సిద్ధవుతున్న నేపథ్యంలో ఈ బదిలీలు కీలకంగా మారాయి. అయితే ఇదంతా పార్లమెంట్ ఎన్నికల కోసమేనని.. ముందు జాగ్రత్తగా గత ప్రభుత్వంలో పనిచేసిన వారందరినీ రేవంత్ సర్కార్ మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గరపడితే ఇంకా ఎవరెవరు బదిలీ అవుతారో.. ఎవరికి ప్రమోషనో.. ఎవరికి డిమోషనో మరి.


Smitha-Sabarwal.jpg

26 మంది ఐఏఎస్‌ల బదిలీ :

  1. డా.శశాంక - రంగారెడ్డి కలెక్టర్‌

  2. అహ్మద్‌ నదీమ్‌ - ప్లానింగ్‌

  3. మహేష్‌దత్‌ ఎక్కా - మైన్స్‌ అండ్‌ జియాలజీ

  4. రాహుల్ బొజ్జా - సెక్రటరీ ఇరిగేషన్‌

  5. హరిచందన - నల్లగొండ కలెక్టర్‌

  6. డా.ఎ.శరత్‌ - ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ

  7. స్మితా సబర్వాల్‌ - ఫైనాన్స్ కమిషన్‌ మెంబర్ సెక్రటరీ

  8. డి. దివ్య - ప్రజావాణి నోడల్‌ ఆఫీసర్‌, డైరెక్టర్‌ మున్సిపల్‌

  9. భారతీ హోళికేరి - డైరెక్టర్‌ ఆర్కియాలజీ

  10. వి. క్రాంతి - సంగారెడ్డి కలెక్టర్‌

  11. అద్వైత్‌కుమార్‌సింగ్‌ - మహబూబాబాద్‌ కలెక్టర్‌

  12. కృష్ణ ఆదిత్య - కార్మికశాఖ డైరెక్టర్‌

  13. చిట్టెం లక్ష్మి - టీఎస్‌ డెయిరీ ఎండీ

  14. అయేషా మస్రత్‌ ఖానమ్‌ - మైనార్టీస్‌ సెక్రటరీ

  15. ఎస్‌.సంగీత - సీఎంవో జాయింట్‌ సెక్రటరీ

  16. బి.ఎం. సంతోష్‌ - జోగులాంబగద్వాల కలెక్టర్‌

  17. అభిలాష అభినవ్‌ - జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌

  18. పి.ఖదీరవన్‌ - అడిషనల్‌ కలెక్టర్‌ హైదరాబాద్ లోకల్‌ బాడీస్‌

  19. బి.వెంకటేశం - బీసీ వెల్ఫేర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ(FAC)

  20. సందీప్‌కుమార్‌ సుల్తానియా - గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి

  21. జ్యోతిబుద్ధప్రకాష్‌ - పర్యావరణం మెంబర్‌ సెక్రటరీ

  22. ఎం.రఘునందన్‌రావు - జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ

  23. ఎం.ప్రశాంతి - ఆయుష్‌ డైరెక్టర్‌

  24. ఆర్‌.వి.కర్ణన్‌ - TSMS IDC ఎండీ

  25. డి.కృష్ణభాస్కర్‌ - ఫైనాన్స్‌ డిపార్ట్‌మెంట్‌ స్పెషల్‌ సెక్రటరీ

  26. ఎం.హరిత - జాయింట్‌ సెక్రటరీ కోఆపరేటివ్‌‌


23 మంది ఐపీఎస్‌లు వీరే..

  • కంట్రోల్ సెల్ ఎస్పీ : రఘువీర్

  • జాయింట్ డైరెక్టర్ ఏసీబీ : శ్రీనివాస్ రెడ్డి

  • ఇంటెలిజెన్స్ ఎస్పీ : ప్రసన్న రాణి

  • సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ : శిల్పవల్లి

  • టీఎస్పీఏ డిప్యూటీ డైరెక్టర్‌ : వెంకటేశ్వర్లు

  • ఇంటెలిజెన్స్ ఎస్పీ : రవీందర్ రెడ్డి

  • సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ : దేవేంద్ర సింగ్

  • సైబరాబాద్ నార్కోటిక్ కంట్రోల్ సెల్ ఎస్పీ : భాస్కర అగ్గాడి

  • రాచకొండ టాస్క్ ఫోర్సు డీసీపీ : చంద్రమోహన్ గుండేటి

  • రాచకొండ ఎస్బీ డీసీపీ : కరుణాకర్

  • రాచకొండ ట్రాఫిక్ డీసీపీ : మనోహర్ కాశివ

  • సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ : నరసింహ కొత్తపల్లి

  • సైబరాబాద్ ఉమెన్స్ సేఫ్టీ డీసీపీ : సృజన కరణం

  • సీఐడీ ఎస్పీ : శ్రీనివాస్ సాయి బేవర్

  • సైబరాబాద్ డీసీపీ ఎస్ఓటీ : శ్రీనివాస్ దన్నరపు

  • గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్ : రాఘవేందర్ రెడ్డి

  • మహేశ్వరం డీసీపీ : సునీత రెడ్డి

  • సీఐడీ ఎస్పీ : జగదీశ్వర్ రెడ్డి

  • డీసీపీ ఈస్ట్ జోన్ హైదరాబాద్ : సాయి శ్రీ నియామకం

Updated Date - Jan 03 , 2024 | 10:06 PM