Home » Smitha Sabarval
రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం సభ్య కార్యదర్శిగా ఉన్న స్మితా సబర్వాల్‌ను యువజన సర్వీసులు, పర్యాటక శాఖ కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది.
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితాసబర్వాల్ దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని హైకోర్టు అభిప్రాయపడింది.
ఐఏఎస్‌లో వికలాంగుల కోటాపై ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ట్విట్టర్(X)వేదికగా వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయంపై వికలాంగులు ఆందోళనకు దిగారు.
దివ్యాంగులను అవమానపరిచిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal)ను వెంటనే విధుల్లో నుంచి తొలగించి ఆమెను అరెస్ట్ చేయాలని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు(Kolli Nageshwar Rao) డిమాండ్ చేశారు.
చట్టాలను అమలు చేయాల్సిన స్థానంలో ఉండి దివ్యాంగులను అవమానించేలా వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్‌పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని టీజేఎస్ అధినేత కోదండరాం కోరారు.
దివ్యాంగుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసినందుకు సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్ బహిరంగ క్షమాపణ చెప్పాలని నమో దివ్యాంగ్ క్యాంపెయినింగ్ భారత్, డిసేబుల్డ్ హెల్ప్‌లైన్ ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ వికా్సశర్మ డిమాండ్ చేశారు.
సివిల్ సర్వీస్‌లలో దివ్యాంగుల కోటాపై చేసిన వ్యాఖ్యలను ఐఏఎస్ అధికారి స్మితాసబర్వాల్(IAS officer Smithasabarwal) ఉపసంహరించుకొని, బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.
సివిల్స్‌లో దివ్యాంగుల కోటాపై ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలను.. ఢిల్లీకి చెందిన ప్రముఖ అడ్వొకసీ గ్రూప్ ‘డాక్టర్స్ విత్ డిజెబిలిటీస్’ తీవ్రంగా ఖండించింది.
రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(IAS officer Smita Sabharwal) మాటలు దేశంలోని దివ్యాంగుల మనోభావాలు, ఆత్మవిశ్వాసం దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆమె తక్షణమే దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలని ప్రముఖ కళాకారిణి డాక్టర్ పద్మావతి(Dr. Padmavathi) డిమాండ్ చేశారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్(Senior IAS officer Smita Sabharwal) సోషల్ మీడియా పోస్ట్ సోమవారం నగరంలో అలజడి సృష్టించింది. సివిల్స్ పోస్టుల ఎంపికలో దివ్యాంగుల కోటా అవసరమా? అని ఆమె తన వ్యక్తిగత ‘ఎక్స్’ ఖాతాలో చేసిన పోస్ట్‌పై పలు సంఘాలు భగ్గుమన్నాయి.