Adventure Travel: మీ సెలవులు ఇలా ప్లాన్ చేయండి.. ఈ కూలెస్ట్ ప్రాంతాలు విజిట్ చేయండి..
ABN , Publish Date - Dec 21 , 2024 | 02:54 PM
ఈ ఏడాది చివరి నెలలో హాలిడే టైం రానే వచ్చేసింది. ఈ నేపథ్యంలో మీరు మీ ఫ్యామిలీ లేదా సన్నిహితులతో కలిసి విహారయాత్ర కోసం ప్లాన్ చేస్తున్నారా. అయితే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన టాప్ 5 చల్లటి ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మళ్లీ హాలిడే సీజన్ రానే వచ్చేసింది. ఈ సందర్భంగా మీరు మీ ఫ్యామిలీ, స్నేహితులు లేదా మీ భాగస్వామితో కలిసి చల్లటి ప్రదేశాలకు వెళ్లాలని చూస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఈ నేపథ్యంలో మీరు హిమపాతాన్ని ఆస్వాదించే భారతదేశంలోని చల్లటి ప్రదేశాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
గుల్మార్గ్, కశ్మీర్
ఇది కశ్మీర్‌లో అత్యంత హిమపాతానికి ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ ప్రదేశం శీతాకాలపు స్వర్గధామమని చెప్పవచ్చు. భారతదేశంలోని స్కై డెస్టినేషన్‌గా ప్రసిద్ధి చెందిన గుల్మార్గ్ డిసెంబర్‌లో స్విట్జర్లాండ్‌లో హవా మాదిరిగా కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక్కడి హిమాలయాల అందాలు మీరు ఎప్పటికీ మరచిపోలేని విధంగా ఉంటాయి. మంచుతో కప్పబడిన ఫైన్ చెట్లు, అద్భుతమైన లోయలతో ఈ ప్రాంతం ఎంతో చూడముచ్చటగా ఉంటుంది.
మనాలి
హిమాచల్ ప్రదేశ్‌లో ఉన్న మనాలి పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం. ఈ ప్రాంతం ప్రతి సంవత్సరం మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ అద్భుతమైన హిమపాతం చూసేందుకు డిసెంబర్ మంచి సమయమని చెప్పవచ్చు. మీరు కుటుంబ విహారయాత్రకు వెళ్లినా లేదా రొమాంటిక్ హనీమూన్‌కి వెళ్లినా ఈ చల్లని వాతావరణం మిమ్మల్ని రిలాక్స్‌గా ఉంచుతుంది. మీరు చాలా చల్లటి ప్రదేశాలను ఇష్టపడకపోయినా, మంచు కురిసేటట్లు ఆస్వాదించాలనుకుంటే, మనాలి మీకు ఉత్తమమైన ప్రదేశం. దీంతోపాటు మీరు హిడింబా దేవి ఆలయం, మనాలి అభయారణ్యం, మాల్ రోడ్ వంటి ప్రదేశాలను కూడా చూడవచ్చు.
సోన్‌మార్గ్
జమ్మూ కశ్మీర్‌లో ఉన్న సోన్‌మార్గ్ మరొక ప్రత్యేకమొన ప్రాంతమని చెప్పవచ్చు. ఇక్కడ హిమపాతం అనుభవం చాలా స్పెషల్. నవంబర్ నాటికి ఈ ప్రదేశం మంచుతో కప్పబడిన అద్భుత ప్రదేశంగా మారుతుంది. సోనామార్గ్‌కు రోడ్ ట్రిప్ అద్భుతంగా ఉంటుంది. ఘనీభవించిన సరస్సులు, స్నోబోర్డింగ్ వంటివి శీతాకాలపు ప్రేమికులకు మరింత ఉత్తేజాన్ని కల్గిస్తాయి.
లేహ్ లడఖ్
వింటర్ సీజన్‌లో వండర్‌ల్యాండ్‌లా కనిపించే ప్రదేశం కోసం చూస్తున్నారా. అందుకోసం లడఖ్ బెస్ట్ అని చెప్పవచ్చు. చలికాలంలో లడఖ్‌లోని కొన్ని ప్రదేశాలు మూసివేయబడినప్పటికీ, లేహ్ చుట్టూ ఉన్న ప్రాంతాలు ఇప్పటికీ అందుబాటులో ఉంటాయి. పూర్తిగా మంచుతో కప్పబడిన దృశ్యాలు ఇక్కడ కనిపిస్తాయి. అవన్నీ చూస్తే మీరు మరొక ప్రపంచానికి వచ్చినట్లు అనిపిస్తుంది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మీరు సరస్సు పూర్తిగా గడ్డకట్టడాన్ని ఇక్కడ చూడవచ్చు. దీంతోపాటు మీరు ఎప్పటికీ మరచిపోలేని మరికొన్ని దృశ్యాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి.
డల్హౌసీ
హిమపాతం పరంగా చూస్తే డల్హౌసీ మంచి ప్రదేశం. పర్యాటకులు ప్రతి సంవత్సరం డిసెంబర్ నుంచి ఫిబ్రవరి సమయంలో ప్రాంతాన్ని ఆస్వాదించడానికి వస్తారు. ఇక్కడ ఉష్ణోగ్రత -5 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోతుంది. ఇది శీతాకాలంలో ఆస్వాదించడానికి సరైన ప్రదేశం. కాబట్టి మీరు వేడి నుంచి తప్పించుకుని మంచులో మునిగిపోవాలనుకుంటే డల్హౌసీ గొప్ప ప్రదేశమని చెప్పవచ్చు.
ఇవి కూడా చదవండి..
Viral Video: టవల్ కట్టుకుని మెట్రో ఎక్కిన యువతులు.. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
Viral Video: ఆహారం అనుకుని పామును పట్టుకున్న చేప.. మధ్యలో రెండు చేపల ఎంట్రీ.. చివరకు చూస్తుండగానే..
Viral Video: పెట్రోల్ కొడుతుండగా.. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేశాడు.. ఆ తర్వాత అతను చేసిన నిర్వాకమిదీ..
Viral: ఇలాంటి ప్లానింగ్ ఎక్కడైనా ఉంటుందా.. ఈ ఇల్లు కట్టిన ఇంజినీర్‌కు చేతులెత్తి మొక్కాల్సిందే..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..