Share News

Viral Video: ఫుడ్‌ను పొరపాటున ఫోన్ అనుకున్న పిల్లాడు..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ABN , Publish Date - Jan 21 , 2024 | 01:15 PM

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు.

Viral Video: ఫుడ్‌ను పొరపాటున ఫోన్ అనుకున్న పిల్లాడు..ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

ప్రముఖ పారిశ్రామిక వేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టును పంచుకున్నారు. వీడియోలో ఓ పసి పిల్లాడు ప్లేటులో ఉంచిన ఆహారాన్ని ఫోన్ అనుకుని పొరపాటున చేవి దగ్గర పెట్టుకుంటాడు. అయితే ఆ పిల్లాడికి ఫుడ్ కూడా ఫోన్ మాదిరిగా కనిపించడంతో అలా చేశాడని అనిపిస్తుంది. అంతేకాదు పిల్లల జీవితాల్లో స్మార్ట్‌ఫోన్‌ వాడకం కూడా నానాటికీ పెరుగుతుందని ఈ వీడియో ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది.


మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Viral Video: వామ్మో.. నిమ్మకాయ ఇలా ఉందేంటి? దెయ్యం నిమ్మకాయ అంటూ నెటిజన్ల కామెంట్లు!

అయితే ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఓ నో అంటూ కామెంట్ చేస్తూ ఈ వీడియోను పంచుకున్నారు. రోటీ, కప్డా ఔర్ మకాన్ ఆ తర్వాతనే మిగతావి అంటు పేర్కొన్నారు. ఇది చూసిన ఓ వ్యక్తి ఈ పోస్ట్ కేవలం ఫన్ కోసం కాదని పిల్లలు సెల్‌ఫోన్‌కు ఎంత బానిస అవుతున్నారో కనిపిస్తోందని అన్నారు. తినదగిన స్మార్ట్‌ఫోన్‌ బాగుందని మరికొంత మంది అంటున్నారు. ఇంకొంత మంది మారుతున్న అవసరాల క్రమాన్ని ప్రతిబింబించేలా ఉందని వ్యాఖ్యలు చేశారు.

2020 ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే ప్రకారం 60% మంది పిల్లలు 5 ఏళ్లు రాకముందే స్మార్ట్‌ఫోన్‌లతో పరిచయం కలిగి ఉంటున్నారని తెలిపింది. అలా చిన్న వయస్సులోనే తరచుగా స్మార్ట్‌ఫోన్లు ఉపయోగించడం వల్ల వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయని నిపుణులు అంటున్నారు. అది క్రమంగా ఎక్కువైతే వారి ఆరోగ్యం ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 01:15 PM