Viral News: ఇది కదా విశ్వాసం.. యజమాని కోసం 200 కిలోమీటర్లు నడిచిన కుక్క..!
ABN , Publish Date - Aug 01 , 2024 | 07:07 PM
Viral News: మనుషులు తమకు తెలియని ప్రాంతానికి వెళ్తేనే తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. తాము ఎక్కడున్నాం అని గందరగోళానికి గురవుతుంటారు. అలాంటిది ఒక కుక్క ఊరు కాని ఊరు.. రాష్ట్రం కాని రాష్ట్రంలో 200 కిలోమీటర్ల దూరంలో తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఇలా లాభం లేదని యజమాని బాధపడుతుండగా..
Viral News: మనుషులు తమకు తెలియని ప్రాంతానికి వెళ్తేనే తప్పిపోయే పరిస్థితి ఉంటుంది. తాము ఎక్కడున్నాం అని గందరగోళానికి గురవుతుంటారు. అలాంటిది ఒక కుక్క ఊరు కాని ఊరు.. రాష్ట్రం కాని రాష్ట్రంలో 200 కిలోమీటర్ల దూరంలో తప్పిపోయింది. ఎంత వెతికినా కనిపించకపోవడంతో ఇలా లాభం లేదని యజమాని బాధపడుతుండగా.. సడెన్ ట్విస్ట్ ఇచ్చింది ఆ గ్రామ సింహం. తప్పిపోయిన 4 రోజుల తరువాత ఆ శునకం నేరుగా తన యజమానికి ఇంటికి వచ్చి చేరింది. ఇప్పుడిదే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు ఇంతకీ ఏం జరిగింది? కుక్క ఎలా తప్పిపోయింది? మళ్లీ ఎలా వచ్చింది? ఇంట్రస్టింగ్ వివరాలు మీకోసం..
కర్ణాటకలోని బెలగావి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో కలిసి మహారాష్ట్రంలోని పండరీపూర్‌కు వెళ్లారు. తమ వెంట పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లారు. అయితే, ఆషాఢ ఏకాదశి రోజున పబ్లిక్ ఎక్కువగా ఉండటంతో.. ఆ కుక్క తప్పిపోయింది. దాని యజమాని, అతని కుటుంబ సభ్యులు కుక్క కోసం ఎంత వెతికినా కనిపించలేదు. దీంతో ఇక లాభం లేదనుకున్న యజమాని కుటుంబం.. తిరిగి ఇంటికి వచ్చేసింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న కుక్క తప్పిపోయిందే అనే బాధలో ఉండిపోయింది ఆ కుటుంబం. కానీ, ఇంతలోనే సంతోషకరమైన సన్నివేశం చోటు చేసుకుంది. తప్పిపోయిందనుకున్న కుక్క.. నాలుగు రోజుల తరువాత తన యజమాని ఇంటికి వచ్చి చేరింది. ఆ కుక్కను చూసిన యజమాని కుటుంబం.. సంతోషంతో ముగినితేలింది.
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న పండరీపూర్ నుంచి కుక్క నడుచుకుంటూ బెలగావి వచ్చింది. దీంతో కుక్క యజమానులే కాకుండా.. స్థానిక ప్రజలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. పాండురంగ దేవుడే తమ కుక్కను తమ ఇంటికి చేర్చారని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బైపోయారు. అంతేకాదు.. ఆ కాలభైరవ ప్రతిరూపానికి ప్రత్యేక పూజలు చేశారు. బెలగావి గ్రామంలో వాడవాడలా ఊరేగించారు.
అయితే, కుక్క పండరీపూర్‌లో తప్పిపోయి మళ్లీ తన యజమాని ఇంటికి చేరుకున్న అంశాన్ని ఆల్ అబౌట్ బెల్గామ్ పేరుతో ఉన్న సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్ కాస్తా వైరల్ అవుతుంది. నిజంగా అద్భుతం అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.