Share News

Trending News: దురదృష్టం అంటే నీదే బాసూ.. రెండు నిమిషాల్లోనే కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ABN , Publish Date - Feb 13 , 2024 | 03:20 PM

ప్రపంచంలో ధనవంతులకు కొదవ లేదు. ఒక్కపూట తినడానికి కూడా లేని కటిక పేదవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు సైతం ఎందరో ఉన్నారు. ప్రపంచంలోని బిలియనీర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది.

Trending News: దురదృష్టం అంటే నీదే బాసూ.. రెండు నిమిషాల్లోనే కోటీశ్వరుడు.. కట్ చేస్తే..

ప్రపంచంలో ధనవంతులకు కొదవ లేదు. ఒక్కపూట తినడానికి కూడా లేని కటిక పేదవాళ్లు ఉన్న ఈ ప్రపంచంలో కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులు సైతం ఎందరో ఉన్నారు. ప్రపంచంలోని బిలియనీర్ల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. వారి సంపద ఎంత ఉందంటే రోజుకు ఒక కోటి రూపాయలు ఖర్చు చేసినా ఆ డబ్బు ఖర్చు చేసేందుకు వారి జీవితం మొత్తం సరిపోనంతగా. ఈ సంపద అంతా ఒక్క క్షణంలో వచ్చి పడిపోయింది కాదు. దీని వెనక ఎన్నో ఏళ్ల కృషి ఉంది. మరెన్నో కష్ట నష్టాలు ఉన్నాయి. అయితే.. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం కేవలం రెండంటే రెండు నిమిషాల్లోనే కోటీశ్వరుడిగా మారాడు. అంతే కాదు.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చరిత్రకెక్కాడు. కానీ........

విలాసవంతమైన జీవితం గడపాలని లాటరీ కొనుగోలు చేసేవారు చాలామందే ఉన్నారు. ఎప్పుడైనా ఒకసారి లాటరీ తగలకపోతుందా అని భావిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అలాంటి పనులేవీ చేయకుండానే కోటీశ్వరుడిగా మారిపోయాడు. 2013లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఇంటర్నెట్ లో మరోసారి చక్కర్లు కొడుతోంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలో ఓ వ్యక్తి విషయంలో అలాంటిదే జరిగింది. క్రిస్ రేనాల్డ్స్ ఒక రోజు తన పే పాల్ అకౌంట్ లో $92 క్వాడ్రిలియన్ జమ అయినట్లు చూసి అవాక్కయ్యాడు. అప్పటి ప్రపంచ ధనవంతుడైన కార్లోస్ స్లిమ్ సంపద కంటే ఇది 10 లక్షల రెట్లు అధికం కావడం గమనార్హం.


సరిగ్గా అప్పుడే పే పాల్ కంపెనీ తన తప్పును గ్రహించింది. జరిగిన పొరపాటుకు క్రిస్ కు స్పందించింది. సాంకేతిక సమస్యతో ఈ తప్పిదం జరిగిందని తెలిపింది. ఇక అంతే మనోడి ప్యూజులు అవుట్ అయిపోయాయి. రెండు నిమిషాల్లోనే కోటీశ్వరుడు అయ్యాననే ఆనందం క్షణం కూడా నిలవకముందే ఆవిరైంది. అయితే.. ఆ డబ్బును ఏం చేస్తారని సదరు కంపెనీ క్రిస్ ను ప్రశ్నించింది. దానికి సమాధానంగా అతను దేశం మొత్తం అప్పు తీరుస్తానని చెప్పడం గమనార్హం.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 03:20 PM