Viral: ఇలా తయారయ్యేంట్రా బాబూ.. బిల్లు ఎగ్గొట్టేందుకు ఇలా కూడా చేస్తారా...
ABN , Publish Date - Feb 01 , 2024 | 09:22 AM
సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడో లేక ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనం రెస్టారెంట్స్ కు వెళ్తుంటాం. మనకు నచ్చింది ఆర్డర్ ఇస్తాం.
సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడో లేక ఏదైనా తినాలి అనిపించినప్పుడు మనం రెస్టారెంట్స్ కు వెళ్తుంటాం. మనకు నచ్చింది ఆర్డర్ ఇస్తాం. ఆ వంటకాన్ని వెయిటర్ తీసుకువచ్చి మనకు వడ్డిస్తాడు. సుష్ఠుగా తిన్న తర్వాత ఆహారానికి సంబంధించిన నగదును బిల్లు రూపంలో కట్టేస్తాం. ఇది నార్మల్ గా జరిగిపోయే ప్రక్రియ. కానీ ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. రెస్టారెంట్ లో నచ్చింది తిన్న తర్వాత అతను చేసే పని చూస్తే ఎవ్వరైనా అవాక్కవ్వాల్సిందే. సరిగ్గా బిల్లు కట్టే సమయానికి అనారోగ్యంతో ఉన్నట్లు కిందపడిపోతాడు. ఆ హడావుడిలో బిల్లు కట్టకుండా తప్పించుకుంటాడు. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 127 సార్లు చేయడం గమనార్హం.
డచ్ కు చెందిన ఓ వృద్ధుడు అప్పుడప్పుడు రెస్టారెంట్ కు వెళ్తుండేవాడు. అలా ఓ రెస్టారెంట్ కు వెళ్లిన అతను.. నచ్చిన ఫుడ్ ను ఆర్డర్ ఇచ్చాడు. వెయిటర్లతో ఎంతో మర్యాదగా వ్యవహరిస్తూ చుట్టుపక్కలా ఉన్నవారిని తనతో కలిసి కూర్చోవాలని కోరాడు. ఫుడ్ షేర్ చేసుకోవాలని సూచించాడు. ఇలా నచ్చింది తిన్న తర్వాత వెయిటర్ బిల్లు ఇచ్చే సమయానికి ఏదో జరిగిపోయినట్లు అనారోగ్యం నటించి కింద పడిపోయాడు. చేతులు కదుపుతూ, గుండెపై చేయి వేసుకుంటూ రొప్పాడు. వెంటనే అక్కడే ఉన్న పారామెడికల్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అతన్ని పరీక్షించగా అబద్ధం చెబుతున్నాడని తేలింది. దీంతో రెస్టారెంట్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందంచింది.
పోలీసులు విచారిస్తున్న సమయంలో విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. రెస్టారెంట్ లో భోజనం చేసిన తర్వాత అనారోగ్యం నటిస్తూ కొన్నాళ్లుగా మోసానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇలా 127 సార్లు చేశాడని తేలడంతో పోలీసులు అవాక్కయ్యారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.