Viral Video: పంచెకట్టు సూపరో సూపరూ.. ఇండియన్ కల్చర్ కు కొరియన్ బాయ్ ఫిదా..
ABN , Publish Date - Feb 27 , 2024 | 04:24 PM
సోషల్ మీడియా వినియోగం దేశాల భౌగోళిక సరిహద్దులను మార్చేసింది. విశాల ప్రపంచాన్ని కుగ్రామంగా చేసేసింది. వివిధ దేశాల్లో ఉన్న వ్యక్తుల మధ్య కనెక్టివిటీని పెంచింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వంటి మాధ్యమాలతో జనాలందరినీ ఒక్కటి చేసింది.
సోషల్ మీడియా వినియోగం దేశాల భౌగోళిక సరిహద్దులను మార్చేసింది. విశాల ప్రపంచాన్ని కుగ్రామంగా చేసేసింది. వివిధ దేశాల్లో ఉన్న వ్యక్తుల మధ్య కనెక్టివిటీని పెంచింది. ఫేస్ బుక్, వాట్సాప్, ఇన్ స్టా గ్రామ్ వంటి మాధ్యమాలతో జనాలందరినీ ఒక్కటి చేసింది. ఈ కనెక్టివిటీలో దేశ విదేశాల సంస్కృతి సంప్రదాయాలు పరస్పరం మార్పులకు లోనవుతున్నాయి. భారతదేశ సంప్రదాయాలు అంటే ప్రపంచ దేశాలన్నింటికీ ఎనలేని అభిమానం. ఇక డ్రెస్సింగ్ విధానంలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పట్టు చీరలు కట్టుకునే మహిళల నుంచి పంచె కట్టులో తళుక్కుమనే పురుషుల వరకు అందరికీ ఎన్నో వెరైటీస్ అందుబాటులో ఉన్నాయి. వీటిపై విదేశీయులు మనసు పారేసుకుంటున్నారు. సందర్భం ఉన్నప్పుడు కట్టుకుని మురిసిపోతున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇన్ స్టా గ్రామ్ లో ఫేమస్ అయిన దక్షిణ కొరియాకు చెందిన బే యూన్-సూ ఇటీవల దక్షిణ భారత సాంప్రదాయ దుస్తుల్లో తళుక్కున మెరిశాడు. బంగారు రంగు అంచు కలిగిన పంచెను ఎంతో పొద్దికగా కట్టుకున్నాడు. అందంగా ఎంబ్రాయిడరీ చేసిన కండువాను భుజాలపై వేసుకున్నాడు. సౌత్ ఇండియాలోని పురుషులు పండుగలు, వేడుకల సమయాల్లో ఈ సంప్రదాయ దుస్తులను ధరిస్తారు. అయితే ఈ వస్త్రాలు తనకు తిరుపతి నుంచి పంపించినట్లు పోస్ట్ లో తెలిపాడు.
"భారతదేశంలో చాలా సాంప్రదాయ దుస్తులు ఉన్నాయి. అవన్నీ చాలా అందంగా ఉంటాయి. అందుకే నేను భారతీయ సాంప్రదాయ ఫ్యాషన్‌ని ఇష్టపడతాను. ఈ అందమైన దుస్తులను నాకు పంపించినందుకు ధన్యవాదాలు. ఆ వేంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని నాకు కలిగించినందుకు సదా కృతజ్ఞుడ్ని" అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. 6 రోజుల క్రితం పోస్ట్ అయిన ఈ వీడియోకు ఇప్పటివరకు 1.9 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వీడియో చూసిన నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.
మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.