Share News

Viral: ఎలక్ట్రిక్ కెటిల్‌లో నోరూరించే చికెన్ రెసిపీ.. హాస్టల్ లైఫ్‌లో అసాధ్యమూ సుసాధ్యమే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:46 AM

ఉన్నత విద్య, ఉద్యోగం, జీవనోపాధి వంటి వివిధ కారణాల నిమిత్తం చాలా మంది నగరాలకు వస్తుంటారు. వారికి అక్కడ బస చేసేందుకు సరిపడా సౌకర్యాలు ఉండవు. దీంతో వారు ప్రైవేటు హాస్టల్స్ ను ఆశ్రయిస్తుంటారు.

Viral: ఎలక్ట్రిక్ కెటిల్‌లో నోరూరించే చికెన్ రెసిపీ.. హాస్టల్ లైఫ్‌లో అసాధ్యమూ సుసాధ్యమే..

ఉన్నత విద్య, ఉద్యోగం, జీవనోపాధి వంటి వివిధ కారణాల నిమిత్తం చాలా మంది నగరాలకు వస్తుంటారు. వారికి అక్కడ బస చేసేందుకు సరిపడా సౌకర్యాలు ఉండవు. దీంతో వారు ప్రైవేటు హాస్టల్స్ ను ఆశ్రయిస్తుంటారు. ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ గత్యంతరం లేని పరిస్థితుల్లో అలాగే నివసిస్తుంటారు. ముఖ్యంగా ఆహారం విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో లభించినట్లు హాస్టల్ లో ఆహారం లభించడం కాస్త అరుదనే చెప్పాలి. దీంతో ఓ పూట తిని మరో పూట పస్తులుంటుంటారు చాలా మంది. కొందరికి వంట వచ్చినా చేసుకునేందుకు వెసులుబాటు లేకపోవడంతో గత్యంతరం లేక అలాగే కాలం గడుపుతుంటారు. అయితే.. కొందరు అమ్మాయిలు మాత్రం వెరైటీగా ఆలోచించారు. ఎలక్ట్రిక్ కెటిల్ లో రుచికరమైన చికెన్ వండి ఆరగించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలో కొందరు అమ్మాయిలు హాస్టల్ రూమ్ లో ఉండడాన్ని చూడవచ్చు. వారు ఓ ప్లేట్ లో ఉల్లిగడ్డలు, పచ్చిమర్చి, టొమాటోలు, బంగాళాదుంపలను ముక్కలుగా కోసుకున్నారు. చికెన్ ను కడిగి శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఓ ఎలక్ట్రిక్ కెటిల్ లో నూనె వేసి, అది వేడయ్యాక చికెన్ వేశారు. అందులో కట్ చేసి పెట్టుకున్న కూరగాయల ముక్కలు వేశారు. అందులోనే కాస్త ఉప్పు, రుచికి సరిపడా కారం, అల్లం, వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, కొత్తిమీర వేశారు. కొన్ని నీళ్లు పోసుకుని బాగా కలిగి కొంత సమయం ఉడికించారు. అంతే.. వేడివేడిగా నోరూరించే చికెన్ రెడీ అయిపోయింది.


ఈ వీడియోను tanushree_khwrkpm అనే అకౌంట్ ద్వారా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు మూడు లక్షలకు పైగా లైక్స్, కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. 'నేను కూడా ఈ రెసిపీని ప్రయత్నిస్తాను.', 'హాస్టల్‌లో ఏదైనా సాధ్యమే' అని తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో రాస్తున్నారు.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 09:46 AM