Share News

Wedding Card: ఓటర్లకు అవగాహన కల్పించే ‘పెళ్లి కార్డు’.. ఎనిమిదో అడుగు వేయాలంటూ..

ABN , Publish Date - Apr 15 , 2024 | 03:17 PM

తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ.. చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించరు. ‘నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏం జరగదులే’ అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటి వారికి ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు కొందరు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు.

Wedding Card: ఓటర్లకు అవగాహన కల్పించే ‘పెళ్లి కార్డు’.. ఎనిమిదో అడుగు వేయాలంటూ..

తమకు ఓటు హక్కు ఉన్నప్పటికీ.. చాలామంది ఓటు వేసేందుకు ఆసక్తి చూపించరు. ‘నేనొక్కడిని ఓటు వేయకపోతే ఏం జరగదులే’ అనే ఆలోచనతో ఇంట్లోనే ఉండిపోతారు. అలాంటి వారికి ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు కొందరు తమవంతు ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) అలీఘర్‌కు చెందిన ఓ కుటుంబం కూడా అదే పని చేసింది. ఓటు వేసేలా ప్రజలను చైతన్యవంతుల్ని చేసేందుకు ఓ వినూత్నమైన వెడ్డింగ్ కార్డ్‌ని ప్రచురించింది. పెళ్లి జంటతో పాటు అతిథులు ఎనిమిదో అడుగు వేయాలని, అది ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని అందులో ముద్రించారు. దీంతో.. ఈ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళ్తే..

Lok Sabha Polls: బహుబలిని మించి.. ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ బూత్..


అలీఘర్‌కు చెందిన అంకిత్‌కు ఈ నెల 21వ తేదీన సుగంధి అనే యువతితో వివాహం జరగనుంది. ఇందుకోసం కుటుంబ సభ్యులు వెడ్డింగ్ కార్డ్‌లను (Wedding Card) సిద్ధం చేశారు. అయితే.. అందరిలా సాధారణ వెడ్డింగ్ కార్డ్‌లని ముద్రించకుండా, లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఓటర్లకు అవగాహన కల్పించేలా దాన్ని తయారు చేశారు. వృత్తిరీత్యా బేకరీ వ్యాపారి, బీజేపీ (BJP) కార్యక్రర్త అయిన అంకిత్ తండ్రి కాళీచరణ్ ఈ మేరకు ఆలోచన చేశారు. తన కుమారుని పెళ్లి కార్డులో.. ‘‘ఓటింగ్ రోజున మీ పనులన్నీ పక్కన పెట్టేసి, ఓటు వేయడానికి వెళ్లండి. ఈ దేశాన్ని ఉద్ధరించేవాడికి మనమంతా ఓటు వేద్దాం’’ అని రాశారు. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోందని, ఎన్నికల పండుగ కూడా ఉంటుందని ఆయన తెలిపారు. ప్రభుత్వం, పాలకులు, మీడియా వాళ్లు ఈ ఎన్నికల్లో చురుకుగా పాల్గొంటున్నప్పుడు.. ప్రజలుగా ఓటు వేయడం మన కర్తవ్యమని చెప్పుకొచ్చారు.

Arvind Kejriwal: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఒకే రోజు డబుల్ షాక్.. అసలేమైందంటే..

అంతేకాదు.. పెళ్లి కార్డులో ‘ఎనిమిదో అడుగు’ ప్రస్తావనని కూడా కాళీచరణ్ తీసుకొచ్చారు. పెళ్లిలో నూతన దంపతులు సాధారణంగా ఏడు అడుగులు వేస్తారని.. అయితే భరతమాత సాక్షిగా పెళ్లి జంటతో పాటు తమ పెళ్లికి వచ్చే అతిథులంతా ఎనిమిదో అడుగు వేయాలని కోరారు. ఈ ఎనిమిదో అడుగు.. ఓటు వేసేందుకు చేసే ప్రమాణం లాంటిదని ఆయన అభివర్ణించారు. దేశం కోసం ఏదైనా చేస్తామని ప్రతిజ్ఞ చేయడానికే ఈ ఎనిమిదో అడుగు అని వివరించారు. అలీఘర్‌లో ఏప్రిల్ 26వ తేదీన లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Polls 2024) జరుగుతున్న తరుణంలో.. దేశంలోని ఓటర్లను చైతన్యపరిచేందుకే ఇలా వెడ్డింగ్ కార్డ్‌ని ముద్రించినట్లు ఆయన వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 15 , 2024 | 03:17 PM