Anand Mahindra: కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఈ వీడియోనే చూస్తా: ఆనంద్ మహీంద్రా
ABN , Publish Date - Feb 26 , 2024 | 04:51 PM
ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన స్ఫూర్తివంతమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మండే మోటివేషన్ (Monday Motivation) పేరిట ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) పంచుకునే స్ఫూ్ర్తివంతమైన విషయాలు నిత్యం వైరల్ (Viral) అవుతుంటాయి. తాజాగా ఆయన షేర్ చేసిన మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. తనకు నిరుత్సాహం కలిగిన ప్రతిసారీ ఈ వీడియోనే చూస్తానంటూ ఆయన చెప్పుకొచ్చారు.
Viral video: ఎలా అడ్డంగా బుక్కయ్యాడో మీరే చూడండి.. సివిల్ డ్రెస్‌లో ఉన్నది ఐపీఎస్ అధికారని తెలీక..
ఈ వీడియో ఓ నిర్మాణ కార్మికుడిది (Construction Worker). అత్యంత ఎత్తైన భవనం నిర్మించే క్రమంలో ఆ కార్మికుడు భవనం చివరకు వరకూ వెళ్లాడు. చాలా అడుగుల ఎత్తున్న ఆ ప్రాంతంపై నిలబడితే చుట్టూ ఉన్న నగరమంతా కనిపిస్తుంది. అంత ఎత్తున అతడు ఏ మాత్రం భయం లేకుండా తన బాధ్యతలు నిర్వహించాడు. తన భుజాన ఓ ఇనుప నిర్మాణాన్ని వేసుకుని అడుగు వెడల్పు మాత్రమే ఉన్న ర్యాంపుపై నడుస్తూ ఇనుప నిర్మాణాన్ని దాని స్థానంలో పెట్టి వచ్చాడు. అతడు కింద పడిపోకుండా నడుముకు బలమైన తీగలు తగిలించి ఉన్నాయి. ఎంతటి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ఉన్నా అలాంటి ప్రదేశాల్లో పనులు చేయాలంటే గుండెధైర్యం మెండుగా ఉండాలి. సవాళ్లను ధైర్యంగా స్వీకరించే తెగింపు ఉండాలి. ఈ లక్షణాలన్నీ దండిగా ఉన్న ఆ నిర్మాణ కార్మికుడే తన స్ఫూర్తి అని ఆనంద్ మహీంద్రా వీడియోపై కామెంట్ చేశారు.
సోమవారం ఆఫీసుకు వెళ్లాలంటే చాలా మంది ఇబ్బంది పడతారు కానీ ఓ నిర్మాణ కార్మికుడు ఇలా సోమవారం తన పని మొదలు పెడతాడని ఆనంద్ మహీంద్రా చెప్పుకొచ్చారు. తనకు వృత్తి జీవితంలో కఠిన పరిస్థితులు ఎదురైన ప్రతిసారీ ఈ స్ఫూర్తివంతమైన వీడియోను చూస్తానని కామెంట్ చేశారు. సహజంగానే ఈ వీడియోపై జనాలు పెద్ద ఎత్తున కామెంట్ చేశారు. ఫాలోవర్లను ఇలా మోటివేట్ చేయడం ఎంతో గొప్పపని అని చెప్పుకొచ్చారు. జీవితంలో కష్టాలు ఎవరికైనా తప్పవని, మనకు దక్కిన వాటిని చూసుకుని కృతజ్ఞతతో జీవించాలని సూచించారు.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి