Banana: అరటిపండ్లు చాలా తొందరగా నల్లబడి వడలిపోతున్నాయా? ఇలా నిల్వ చేసి చూడండి..!
ABN , Publish Date - Apr 16 , 2024 | 04:43 PM
అరటిపండ్లు తాజాగా ఉండే తినబుద్దేస్తుంది. కానీ అరటిపండ్లు మాత్రం కొన్న మరుసటిరోజుకే నల్లగా మారిపోయి లోపల పండు మెత్తగా అయిపోతుంటుంది. దీంతో తినాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.
అరటిపండ్లు అందరికీ ఇష్టం. చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు అందరూ సులువుగా తినదగిన పండు ఇది. తక్కువ ధరలో అన్ని తరగతుల వారికి ఇది లభ్యమవుతుంది. పోషకాహార నిపుణులు యాపిల్ తరువాత ప్రతి రోజూ ఒక అరటిపండు తినడం మంచిదని అంటున్నారు. అయితే అరటిపండ్లు తాజాగా ఉండే తినబుద్దేస్తుంది. కానీ అరటిపండ్లు మాత్రం కొన్న మరుసటిరోజుకే నల్లగా మారిపోయి లోపల పండు మెత్తగా అయిపోతుంటుంది. దీంతో తినాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే ఈ కింది టిప్స్ ఫాలో అవ్వాల్సిందే..
అరటిపండ్లను వేలాడదీయడం వల్ల త్వరగా పాడవ్వవు. వీటిని గాలిలేని ప్రదేశంలో వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
AC Tips: ఏసి ఎంతసేపు వాడినా తక్కువ కరెంట్ బిల్ రావాలంటే.. ఈ సింపుల్ టిప్స్ పాటించాల్సిందే..!
అరటిపండ్లను ప్లాస్టిక్‌లో చుట్టినట్లయితే అవి తాజాగా ఉంటాయి. అరటిపండ్లను కప్పి ఉంచినట్లయితే అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.
అరటిపండ్లు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే వాటిపై వెనిగర్‌ను అప్లై చేయాలి. వెనిగర్ అప్లై చేసి గాలి తగిలే ప్రదేశంలో ఉంచడం వల్ల చాలా కాలం పాటు తాజాగా ఉంటాయి.
రిఫ్రిజిరేటర్‌లో ఉంచినప్పటికీ అరటిపండ్లు తాజాగా ఉంటాయి. అయితే వాటిని ఫ్రిజ్‌లో ఉంచే ముందు వాటిని గాలి చొరబడని కవర్‌లో ప్యాక్‌లో ఉంచాలి.
అరటిపండ్ల మధ్యలో ఒక అరటిపండు కుళ్ళినా, మెత్తబడినా దానిని తీసివేయాలి. లేదంటే మిగిలిన అరటిపండ్లు కూడా కుళ్లిపోవచ్చు.
Cracked Heels: వేసవిలో కాలి పగుళ్లు ఎక్కువ అవుతున్నాయా? ఇంట్లోనే తయారుచేసుకునే ఈ క్రీమ్ తో మ్యాజిక్కే..!
అరటిపండ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే విటమిన్ సి ట్యాబ్లెట్‌ని నీటిలో కరిగించి అందులో ఉంచితే అరటిపండ్లు త్వరగా పాడవకుండా ఉంటాయి.
అరటిపండ్లను తాజాగా ఉంచడానికి మైనపు కాగితాన్ని కూడా ఉపయోగించవచ్చు. అరటిపండ్లను మైనపు కాగితంలో చుట్టి ఉంచితే త్వరగా పాడవకుండా ఉంటాయి.
అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!
రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.