Viral video: కొన్ని నిమిషాల తర్వాత.. అక్కడ ప్రత్యక్షం...
ABN , Publish Date - Jul 29 , 2024 | 11:47 AM
మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకతాయిల అల్లరి ఎక్కువ అవుతోంది. రోడ్డు మీద వెళ్లే సమయంలో కూడా వదలడం లేదు. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఉన్న లెక్క చేయడం లేదు. కారులో వెళ్లేవారిపై ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. కారు డోర్ ముందు కాలితో తన్ని, సైగలతో హేళన చేశారు. వారి చేష్టలు అన్ని రికార్డయ్యాయి.
బెంగళూర్: మెట్రోపాలిటన్ నగరాల్లో ఆకతాయిల అల్లరి ఎక్కువ అవుతోంది. రోడ్డు మీద వెళ్లే సమయంలో కూడా వదలడం లేదు. ఆయా చోట్ల సీసీ కెమెరాలు ఉన్న లెక్క చేయడం లేదు. కారులో వెళ్లేవారిపై ఆకతాయిలు అనుచితంగా ప్రవర్తించారు. కారు డోర్ ముందు కాలితో తన్ని, సైగలతో హేళన చేశారు. వారి చేష్టలు అన్ని రికార్డయ్యాయి.
ఏంటంటే..?
బెంగళూరులో (Bengalure) బిజీగా ఉండే రహదారిలో ఓ కారు వెళుతోంది. ఆ కారు వ్యక్తి వెంట ఐదుగురు పడ్డారు. పక్కన స్కూటీ మీద ఇద్దరు అనుచితంగా ప్రవర్తించారు. ఏం జరిగిందో తెలియదు.. వెనకాల కూర్చొన్న ఒకడు కారు డోర్ పక్కన తన్నాడు. అంతటితో ఆగలేదు. సైగలు చేసి కొడతాం, చంపుతాం అనేట్టు మాట్లాడారు. వెనకాల మరో స్కూటీ మీద ముగ్గురు వచ్చారు. వారు కూడా అంతే.. కారులో ఉన్న వ్యక్తి పైకి కాలు లేపాడు. కారు వెళ్లేదారిలో స్కూటీ తీసుకొచ్చాడు. జరుగుతున్న తతంగం అంత మరొకరు వీడియో తీశాడు. సోషల్ మీడియాలో ఎక్స్‌లో షేర్ చేశారు. రోడ్డు మీద వెళ్లేప్పుడు థ్రిల్‌గా అనిపించొచ్చు.. స్టేషన్ వెళ్లిన తర్వాత చిల్ అవుతారు. సినిమాల్లో స్టంట్స్ చేయాలి. వీధుల్లో కాదు అని క్యాప్షన్ ఇచ్చారు. ఆ వీడియో బెంగళూర్ పోలీసుల దృష్టికి వచ్చింది.
కొన్ని నిమిషాల తర్వాత..
వీడియోలో ఆకతాయిల అల్లరి స్పష్టంగా కనిపిస్తోంది. తర్వాత ఫ్యూ మినిట్స్ లెటర్ అని ఇచ్చారు. ఆ వీడియోలో అల్లరి చేసిన ఆకతాయిలను అరెస్ట్ చేసి, స్టేషన్ తీసుకొచ్చారు. ఒక్కొక్కరిని వీడియోలో చూపించారు. ఆ వీడియోకు నెటిజన్లు జోరుగా కామెంట్ చేస్తున్నారు. ఆకతాయిలు చేసిన పనిని చాలామంది తప్పు పట్టారు. ఆ వీడియో తీసిన మరోకరికి రివార్డు ఇవ్వాల్సిందేనని మరికొందరు అభిప్రాయ పడ్డారు. లేదంటే ఈ ఘటన ప్రపంచానికి తెలిసేది కాదన్నారు. ఇలాంటి సిచుయేషన్ తాను ఎదుర్కొన్నానని ఓ నెటిజన్ రాసుకొచ్చారు. ఆకతాయిలను ఎన్ని రోజులు జైలులో ఉంచుతారు.. ఒకరోజు, లేదంటే రెండు రోజులు..? వారి లైసెన్స్ రద్దు చేయరా అని మరొ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.