Share News

Bengaluru: స్కూటీ అనుకున్నవా..? లేక

ABN , Publish Date - Aug 18 , 2024 | 07:06 PM

ఐటీ హబ్ బెంగళూర్‌లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు గుర్తించి, కేసు నమోదు చేశారు.

Bengaluru: స్కూటీ అనుకున్నవా..? లేక
Bengaluru Police Takes Action

బెంగళూర్: ఐటీ హబ్ బెంగళూర్‌లో ఆకతాయిల వల్ల వాహనదారులు తెగ ఇబ్బంది పడుతున్నారు. కొందరు రోడ్ల మీద స్టంట్లు చేస్తున్నారు. ఆ స్టంట్లను వీడియో తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఆకతాయిలను పట్టుకొని మరీ బుద్ది చెబుతున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు ఇలానే చేశారు. వారందరిని పోలీసులు (Bengaluru Police) గుర్తించి, కేసు నమోదు చేశారు.


blr-police--1.jpg


రద్దీ రహదారిలో..

బెంగళూర్‌లో ప్రధాన రహదారులు రద్దీగా ఉంటాయి. కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు రహదారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిజీ రోడ్డులో ఒకతను స్కూటీతో ఫీట్లు చేశాడు. అతని వెనకాల మరొకడు ఉన్నాడు. అయినప్పటికీ స్కూటీ ముందటి టైర్ లేపి, బ్యాలెన్స్ చేస్తూ నడిపాడు. కాసేపు దూరంగా డ్రైవ్ చేశాడు. టూ వీలర్స్ మీద కొందరు డ్రైవ్ చేశారు. అలాంటి ఫీట్లు చేసే సమయంలో కనీసం హెల్మెట్ ధరించలేదు. టూ వీలర్‌తో ఫీట్లు చేసి, వారే కాదు.. ఇతర ప్రాణాలను కూడా ఫణంగా పెట్టారు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. రైడ్ చేసిన 44 మందిని అరెస్ట్ చేశారు. వారిపై 33 కేసులు నమోదు చేశారు. పోలీసుల చర్యలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: సిగ్నల్ వద్ద ప్రియురాలిపై చేయి వేసిన ప్రియుడు.. కారు దిగి అక్కడి వెళ్లిన మరో యువతి.. చివరకు..


blr-2.jpg


కఠిన చర్యలు

ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను నెటిజన్లు కోరారు. అలాంటి వారిపై కేసులు నమోదు చేసినప్పటికీ మరికొందరు ఇలానే ప్రవర్తిస్తున్నారు. దాంతో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఒకరు.. స్కూటీపై ఫీట్ చేసిన యువకుడిని అరెస్ట్ చేసి జైలులో వేయాలని.. ఇలాంటి నిరక్షరాస్యుల వల్ల బెంగళూర్‌లో ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని మరొకరు రాసుకొచ్చారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెద్ద ఏనుగు ముందు నీళ్ల బకెట్ పెట్టగా.. కళ్లు మూసి తెరిచే లోపు ఏం జరిగిందో చూస్తే..


blr-4.jpg


నిర్లక్ష్యం వల్లే

నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటన జరుగుతున్నాయి. టూ వీలర్స్‌తో ఫీట్లు చేసే వారు వారి ప్రాణాలే కాక ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా ఏం చేయాలని మరొకరు అడిగారు. మీకు, మీ కుటుంబానికి దేవుడు మంచి చేయాలి.. మీరు నిజంగా సూపర్ హీరోలు అని నాలుగో నెటిజన్ కామెంట్ చేశారు. పోలీసుల తీరును ప్రశంసలతో ముంచెత్తారు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Aug 18 , 2024 | 07:07 PM