Viral Video: డెడ్ బాడీతో బ్యాంక్‌కి వెళ్లిన మహిళ.. చివరికి ఏమైందంటే?
ABN , Publish Date - Apr 20 , 2024 | 11:42 AM
డబ్బుల కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత వ్యక్తుల్ని చంపడం, శవాలపై బిజినెస్ చేయడం వంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒళ్లుగగుర్పొడిచే అలాంటి ఘటనే వెలుగు చూసింది. పెన్షన్ డబ్బుల కోసం ఒక మహిళ..
డబ్బుల కోసం కొందరు వ్యక్తులు ఎంతకైనా తెగిస్తుంటారు. సొంత వ్యక్తుల్ని చంపడం, శవాలపై బిజినెస్ చేయడం వంటి ఘటనలు గతంలో చాలానే చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఒళ్లుగగుర్పొడిచే అలాంటి ఘటనే వెలుగు చూసింది. పెన్షన్ డబ్బుల కోసం ఒక మహిళ.. చనిపోయిన తన అంకుల్‌ని వీల్‌ఛైర్‌పై బ్యాంక్‌కు తీసుకెళ్లింది. అనంతరం బ్యాంక్‌లో జరిగిన పరిణామాలతో ఖంగుతిన్న సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన బ్రెజిల్‌లో (Brazil) జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
రిషభ్ పంత్‌కి ప్రమోషన్.. టీమిండియా కెప్టెన్‌గా..?
బ్రెజిల్‌కు చెందిన ఎరికా వియెరా నూన్స్ (Erika Vieira Nunes) అనే మహిళ మంగళవారం (16/04/24) చనిపోయిన ఓ వ్యక్తిని వీల్‌చైర్‌పై బ్యాంక్‌కు తీసుకొచ్చింది. ఆ వ్యక్తి పేరు పాలో రాబర్టో (68). ఆమె ఒక కౌంటర్ వద్దకు వెళ్లి.. రాబర్టో తన అంకుల్ అని, ఆయన 17వేలు రియాస్ (ఇండియన్ కరెన్సీలో రూ.2.71 లక్షలు) రుణం పొందాలని అనుకుంటున్నాడని పేర్కొంది. దీంతో.. సదరు బ్యాంకర్ కొన్ని పత్రాలు ఇచ్చి, అందులో సంతకాలు చేయించమని చెప్పాడు. అప్పుడు ఆమె ఆ బ్యాంక్ పేపర్లపై రాబర్టోతో సంతకం చేయించేందుకు ప్రయత్నించింది. కానీ.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ‘‘అంకుల్, మీరు వింటున్నారా? మీరు సంతకం చేయాలి’’ అంటూ చెప్తూ.. సంతకం చేయించే ప్రయత్నం చేసింది. వీల్‌ఛైర్‌పై ఉన్న వ్యక్తి ఆల్రెడీ చనిపోయినట్లుగా కనిపించడంతో.. ఓ వ్యక్తి ఈ మొత్తం తతంగాన్ని తన ఫోన్‌లో రికార్డ్ చేశాడు.
వేసవిలో దోసకాయలు తింటే.. ఈ లాభాలు మీ సొంతం!
అప్పటికీ నూన్స్ తన అంకుల్ బతికే ఉన్నాడంటూ నాటకమాడుతూ.. ‘‘మీకు బాగోలేకపోతే, నేను మిమ్మల్ని ఆసుపత్రికి తీసుకెళ్తాను’’ అని చెప్పడం కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. ‘‘ఆయన ముఖం ఎందుకు పాలిపోయింది’’ అని ప్రశ్నించారు. ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల తన అంకుల్ ఇలా మారిపోయాడని నూన్స్ సమాధానం ఇచ్చింది. ఇదే సమయంలో ఆ వ్యక్తి తల పదే పదే వెనక్కు పడిపోవడం చూసిన బ్యాంక్ సిబ్బంది.. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అధికారులు వెంటనే బ్యాంక్‌కి చేరుకొని, ‘మోసం’ ఆరోపణలతో నూన్స్‌ని అరెస్ట్ చేశారు. అలాగే.. పోస్టుమార్టం నిమిత్తం రాబర్టో మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించాక మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హార్దిక్ పాండ్యాకు భారీ షాక్.. ఆ తప్పు కారణంగా..
విచారణ సమయంలో.. బ్యాంక్‌కు తీసుకొచ్చిన తర్వాత తన అంకుల్ చనిపోయాడని, అప్పటివరకూ ఆయన బాగానే ఉన్నాడని నూన్స్ చెప్పింది. అయితే.. ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో మాత్రం.. రాబర్టో అంతకన్నా ముందే చనిపోయినట్లు తేలింది. రాబర్టో పేరు మీద డబ్బులు తీసుకోవడం కోసం.. అతని మృతదేహంతో నూన్స్ బ్యాంక్‌కి వెళ్లిందని, అతడు బతికే ఉన్నట్టుగా నటించేందుకు ప్రయత్నించిందని ఓ పోలీసు అధికారు తెలిపారు. కానీ.. బ్యాంక్‌కి రావడానికి కొన్ని గంటల ముందే రాబర్టో చనిపోయినట్లు రిపోర్ట్‌లో తేలిందని స్పష్టం చేశారు. తాము విచారణ జరిపి.. రాబర్టోతో నూన్స్‌కి ఉన్న సంబంధం ఏంటో తెలుస్తామని అధికారులు తెలిపారు.