Viral Video: ఎస్‌బిఐ బ్యాంకులోకి వెళ్లిన ఎద్దు..తర్వాత ఏమైందంటే
ABN , Publish Date - Jan 10 , 2024 | 05:18 PM
ఓ ఎస్‌బిఐ బ్యాంక్‌లోకి ఆకస్మాత్తుగా ఎద్దు ప్రవేశించింది. అయితే అసలు ఎద్దు(bull) బ్యాంకుకు ఎందుకు వెళ్లింది, దానికి ఏదైనా లోన్ ఇస్తున్నారా లేదా ఇంకేదైనా విషయం ఉందో తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
అప్పుడప్పుడు జంతువులు నగరాల్లో పని ప్రదేశాలకు దూసుకురావడం లేదా వాహనాలు వేగంగా రావడం వంటి సంఘటనలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అలాంటి సంఘటన ఒకటి జరిగింది. కానీ ఈసారి ఏకంగా దేశంలోనే ప్రధాన బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లోకి ఓ ఎద్దు(bull) ప్రవేశించింది. అంతే దీంతో అక్కడున్న సిబ్బందితోపాటు అక్కడకు వచ్చిన కస్టమర్లు కూడా భయాందోళన చెందారు. ఇది ఉత్తరప్రదేశ్(uttar pradesh) ఉన్నావో(unnao) ప్రాంతంలో చోటుచేసుకుంది.
అయితే బ్యాంకు(bank)లోనికి ప్రవేశించిన ఎద్దు(bull) ఎవ్వరినీ ఏమి అనకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. కొద్ది సేపు అటు ఇటు పరిశీలించిన జంతువును అక్కడి సెక్యూరిటీ సిబ్బంది గమనించి దానిని బయటకు పంపించారు. కానీ ఆ ఎద్దు బ్యాంకులో ఉన్న సమయంలో అక్కడి కస్టమర్లు మాత్రం తమపైకి వస్తుందోమేనని అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. ఈ సంఘటన జరుగుతున్న క్రమంలో ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..ప్రస్తుతం ఇది నెట్టింట తెగ వైరల్ అవుతోంది.