Butterflies: పర్యాటకులను ఆకట్టుకుంటున్న పచ్చని సీతాకోకచిలుకలు..
ABN , Publish Date - Jun 12 , 2024 | 01:31 PM
నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
చెన్నై: నీలగిరి జిల్లా ముదుమలై పులుల శరణాలయానికి వచ్చే పర్యాటకులను పచ్చరంగు సీతాకోకచిలుకలు(Butterflies) ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ముదుమలై మైసూర్ జాతీయ రహదారికి ఇరువైపులా లేత పచ్చ, పసుపు రంగుల్లో సీతాకోకచిలుకలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఊటీలో ఉన్న సీతాకోకచిలుకల ప్రేమికుడు డా. జీవిత్ మాట్లాడుతూ... రాష్ట్రంలో 327 రకాల సీతాకోకచిలుకలున్నాయని, అందులో నీలగిరి(Neelagiri)లో 320 రకాలున్నాయన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: ఈ పోలీస్‌స్టేషన్ వెరీ హాట్.. సెటిల్‌మెంట్లకు కేరాఫ్ మంగళ్‌హాట్ పీఎస్
ప్రస్తుతం రుతుపవన వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో, కాటాఫ్సిలియాపోమోనా అనే తెల్లరంగు సీతాకోకచిలుకలు గూడు నుంచి వెలుపలికి వచ్చేటప్పుడు తేమ మట్టిలో ఉన్న ఉప్పు గ్రహించి వర్షాలకు ముందుగానే వేరే ప్రాంతానికి వలసపోతాయని తెలిపారు. తొలిదశలో ఇవి లేత పచ్చరంగులో కనిపిస్తాయని, అలాగే ఇతర రకాల సీతాకోకచిలుకలు ఈ సీజన్‌లో ఎక్కువగా కనిపిస్తాయని వెల్లడించారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News