Share News

Viral Video: బ్రిడ్జ్‌పై నుంచి నదిలో దూకిన మహిళ.. జుట్టు పట్టుకుని ప్రాణాలను కాపాడిన క్యాబ్ డ్రైవర్

ABN , Publish Date - Aug 17 , 2024 | 09:55 AM

కొంత మంది అయితే చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తున్నారు. తాజాగా కూడా ఓ 57 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుందామని ఓ క్యాబ్‌లో బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లి, తర్వాత క్యాబ్ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి నదిలోకి దూకేసింది. వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ ఆమె జట్టు పట్టుకుని ఆమె ప్రాణాలను కాపాడాడు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: బ్రిడ్జ్‌పై నుంచి నదిలో దూకిన మహిళ.. జుట్టు పట్టుకుని ప్రాణాలను కాపాడిన క్యాబ్ డ్రైవర్
Cab driver saves life of woman viral video

ఇటివల కాలంలో ఎవరు, ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారనేది అర్థం కావడం లేదు. కొంత మంది అయితే చిన్న చిన్న కారణాలకే సూసైడ్ వరకు వెళ్తున్నారు. తాజాగా కూడా ఓ 57 ఏళ్ల మహిళ సూసైడ్ చేసుకుందామని ఓ క్యాబ్‌లో బ్రిడ్జ్ దగ్గరకు వెళ్లింది. ఆ తర్వాత క్యాబ్ డ్రైవర్‌కు డబ్బులు ఇచ్చి నదిలోకి దూకేసింది. అదే సమయంలో వెంటనే అప్రమత్తమైన క్యాబ్ డ్రైవర్ ఆమె జట్టు పట్టుకుని ఆమె ప్రాణాలను కాపాడాడు. అదే సమయంలో పోలీసులు కూడా రావడంతో ఆ మహిళను కాపాడటం మరింత సులభమైంది. ఈ ఘటన మహారాష్ట్ర(maharashtra) ముంబై(mumbai)లోని అటల్ బిహారీ వాజ్‌పేయి ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్ (అటల్ సేతు పుల్)పై జరిగింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


జట్టు పట్టుకుని

వీడియోలో ఓ మహిళ అటల్ సేతు వంతెనపై నుంచి దూకగానే వెంటనే క్యాబ్ డ్రైవర్ ఆమె జట్టు పట్టుకుని రక్షించడం కనిపిస్తుంది. ఆ తర్వాత పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఆ మహిళ పోలీసులను చూసి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించినట్లుగా కూడా వీడియో ద్వారా అనిపిస్తుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటన సాయంత్రం ఏడు గంటలకు జరిగిందని తెలిపారు. ములుంద్ నివాసి అయిన మహిళ సముద్రంలో మతపరమైన చిత్రాలను నిమజ్జనం చేస్తాననే కారణంతో కారును అటల్ సేతు వంతెన దగ్గర ఆపమని 31 ఏళ్ల క్యాబ్ డ్రైవర్ సంజయ్ యాదవ్‌ను కోరింది. ఆ క్రమంలో బ్రిడ్జి దగ్గర క్యాబ్ ఆగడం, రైలింగ్ దాటుతున్న మహిళ గురించి తమకు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు.


కానిస్టేబుళ్లు

షెల్‌ఘర్ టోల్ నాకాకు వెళ్లే రహదారిలో అటల్ సేతు వంతెనపై వాహనం ఆగిపోయిందని, వంతెన రెయిలింగ్‌ను దాటి ఓ మహిళ ఏదో చేస్తోందని న్హవా శేవా ట్రాఫిక్ బ్రాంచ్ పెట్రోలింగ్ ఫోన్‌లో సమాచారం అందించారు. ఆ తర్వాత ఈ ఘటన చోటుచేసుకోగా నలుగురు కానిస్టేబుళ్లు రైలింగ్‌ దాటి వచ్చి మహిళను కాపాడారు. ఆ తర్వాత మహిళను నవీ ముంబై పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ విషయంపై మహిళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. మహిళ మానసిక వ్యాధితో బాధపడుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారని నవా షెవా పోలీస్ స్టేషన్ సీనియర్ సూపరింటెండెంట్ అంజుమ్ బగ్వాన్ తెలిపారు.


గతంలో కూడా

అటల్ సేతు వంతెనపై నుంచి సముద్రంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు గతంలోనూ జరిగాయి. ఈ ఏడాది జులైలో 38 ఏళ్ల ఇంజనీర్ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒత్తిడితో అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకుముందు మార్చిలో 43 ఏళ్ల మహిళా డాక్టర్ అటల్ వంతెనపై నుంచి దూకింది. ఆత్మహత్యకు ముందు ఆ మహిళ తన ఫ్లాట్‌లో సూసైడ్ నోట్‌ను ఉంచింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహిళ డిప్రెషన్‌తో బాధపడుతూ చికిత్స పొందుతోంది. మరికొన్ని ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. కానీ పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


ఇవి కూడా చదవండి..

Optical Illusion: మీ కళ్ల శక్తి ఏంటో తెలుసుకోండి.. ఈ ఫొటోలో దాక్కున్న పిల్లిని 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: వడగళ్ల వానకు భయపడ్డ పక్షి.. ఓ ఇంటి డోర్ ముందు నిల్చుని ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్!


Viral Video: ఖరీదైన కారుతో సెల్ఫీ దిగిన బుడగలమ్మే వ్యక్తి.. యజమాని వచ్చి ఏం చేశాడో చూస్తే కళ్లు చెమర్చక మానవు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 17 , 2024 | 09:58 AM