Share News

Viral Video: వామ్మో.. ఇదెలా జరిగింది? కారులో ఒంటె ఇలా ఇరుక్కుపోయిందేంటి? వైరల్ అవుతున్న వీడియో!

ABN , Publish Date - Jun 09 , 2024 | 04:04 PM

రాజస్థాన్‌లోని శనివారం రాత్రి ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటెను ఢీకొట్టింది. దీంతో కారులోకి ఒంటె దూసుకెళ్లిపోయింది. ఆ ఘటనలో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు కూడా గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది.

Viral Video: వామ్మో.. ఇదెలా జరిగింది? కారులో ఒంటె ఇలా ఇరుక్కుపోయిందేంటి? వైరల్ అవుతున్న వీడియో!
Camel gets stuck in car

రాజస్థాన్‌ (Rajasthan)లోని శనివారం రాత్రి ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఒంటె (Camel)ను ఢీకొట్టింది. దీంతో కారులోకి ఒంటె దూసుకెళ్లిపోయింది. ఆ ఘటనలో వాహనం దెబ్బతినడంతో పాటు ఒంటెకు కూడా గాయాలయ్యాయి. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో ఈ ప్రమాద ఘటన చోటు చేసుకుంది. కారు బానెట్‌ పై ఉన్న ఒంటెకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


హనుమానగఢ్ ప్రాంతంలో రాత్రి వేళల్లో ప్రయాణిస్తున్న కారు ఒంటెను ఢీకొట్టింది. దీంతో ఒంటె వెనుక భాగం కారులో ఇరుక్కుపోయింది. కారు ముందు అద్దం పగిలిపోయి ఒంటె అందులో ఇరుక్కుపోయింది. ఒంటె బరువుకు కారు బానెట్ నుజ్జునుజ్జు అయిపోయింది. అయితే అదృష్టవశాత్తూ.. ఈ ఘటనలో కారులోని వ్యక్తులుకు పెద్దగా దెబ్బలు తగ్గలేదు. ఒంటెకు మాత్రం కొన్ని గాయాలు అయ్యాయి. కాగా, కారులో ఉన్న ఒంటెను బయటకు తీయడానికి చాలా శ్రమపడాల్సి వచ్చింది (Camel gets stuck in car).


కారు ముందు భాగంలో ఒంటె ఇరుక్కుపోయిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కారులో ఇరుక్కున్న ఒంటె బాధతో కేకలు వేసింది. చాలా సేపటి తర్వాత ఆ ఒంటెను బయటకు తీసి చికిత్స చేయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 71 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. రాజస్థాన్‌లో రాత్రిపూట ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమని, చీకట్లో ఒంటెలు సరిగ్గా కనిపించవని చాలా మంది కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: బ్రెజిల్‌లోనే ఇలాంటివి సాధ్యం.. నడిరోడ్డుపై భారీ కొండ చిలువ ఎలా వెళ్తోందో చూడండి..!


Optical Illusion: ఈ ఫొటోలో విభిన్నమైన జంట ఏదో కనిపెడితే మీ కళ్లు నిజంగా పవర్‌ఫుల్ అని నమ్మవచ్చు..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 09 , 2024 | 04:04 PM