Car Mileage Tips: మీ కారు తక్కువ మైలేజీ ఇస్తుందా? వెంటనే ఇలా చేయండి..
ABN , Publish Date - Aug 08 , 2024 | 10:15 PM
Car Mileage Tips: కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం పెరిగిపోయింది. ప్రజా రవాణాను తగ్గించి.. పర్సనల్ వెహికల్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్వంత కారును కలిగి ఉన్నారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండటం, ఇబ్బంది లేకుండా జర్నీ చేయడం
Car Mileage Tips: కరోనా తరువాత ప్రపంచ వ్యాప్తంగా కార్ల వినియోగం పెరిగిపోయింది. ప్రజా రవాణాను తగ్గించి.. పర్సనల్ వెహికల్స్‌లో ట్రావెల్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో చాలా మంది స్వంత కారును కలిగి ఉన్నారు. ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండటం, ఇబ్బంది లేకుండా జర్నీ చేయడం కోసం చాలా మంది కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, సౌకర్యాలు సంగతి ఎలా ఉన్నా.. కారు మైలేజీ మాత్రం వాహనదారులను భయపెడుతుందనే చెప్పాలి. కొంత కాలం కారు మైలేజీ సరిగానే ఇచ్చినప్పటికీ.. ఆ తరువాత మైలేజీ క్రమంగా తగ్గుతుంటుంది. చాలా మంది తమ కారు తక్కువ మైలేజీ ఇస్తుందని వాపోతుంటారు. మీరు కూడా మీ కారు మైలేజీ గురించి ఆందోళన చెందుతున్నారా? కారు మైలేజీ పెంచుకునే ప్లాన్ చేస్తున్నారా? మీకోసం ఈ సూపర్ టిప్స్.. ఈ టిప్స్ పాటించడం ద్వారా మీ కారు మైలేజీని పెంచుకోవచ్చు. అదెలాగో ఈ కథనంలో చూద్దాం.
సరైన డ్రైవింగ్..
అన్నింటికంటే ముందు.. డ్రైవింగ్ సాఫీగా చేయాలి. ఎక్కువ మైలేజీ కావాలంటే.. డ్రైవింగ్ ఒకే విధంగా, సాఫీగా చేయాలి. ఫాస్ట్ డ్రైవింగ్, హార్డ్ బ్రేకింగ్స్, రాష్ డ్రైవింగ్ చేయకూడదు. ఇలా చేయడం వల్ల చాలా ఇంధనం ఖర్చు అవుతుంది.
మెయింటెనెన్స్..
కారును జాగ్రత్తగా చూసుకోవాలి. కారును ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలి. సమయానికి సర్వీసింగ్‌కు ఇస్తూ మెయింటెన్ చేయాలి. ఇంజిన్ ఆయిల్ మార్చడం, టైర్ రొటేషన్ అలైన్‌మెంట్, ఎయిర్ ఫిల్టర్ సరైన సమయంలో మార్చడం చేయాలి.
బరువు..
కారులో అధిక బరువు ఉంటే.. ఇంధనం ఎక్కువ వినియోగమవుతుంది. అందుకే.. కారులో అధిక బరువు లేకుండా చూసుకోవాలి. అనవసరమైన వస్తువులను ఉంచకూడదు. కారులో అనవసరమైన భారీ పరికరాలు ఏవైనా ఉంటే బయటకు తీసేయాలి.
టైర్లలో గాలి..
కారు టైర్లలో తక్కువ గాలి ఉంటే.. అది రోలింగ్ నిరోధకతను పెంచుతుంది. ఇది కారు డ్రైవింగ్ చేసేటప్పుడు అధిక ఇంధన వినియోగానికి కారణం అవుతుంది. అందుకే కార్ల టైర్లలో గాలిని సరిగా చెక్ చేయాలి. టైర్లలో సరిగా గాలి ఉండేలా చూసుకోవాలి.
నాణ్యతతో కూడిన ఇంధనం..
కారు మైలేజీ అధికంగా రావాలంటే.. ముందుగా మీ కారులో నాణ్యమైన ఇంధనాన్ని మాత్రమే వినియోగించాలి. సరైన, నాణ్యమైన ఇంధనాన్ని ఉపయోగించకపోతే మైలేజీ తగ్గడంతో పాటు.. ఇంజిన్ లైఫ్ కూడా తగ్గిపోతుంది.