UAE Video: దుబాయిలో వర్ష బీభత్సం.. ప్రాణం కాపాడుకోవడానికి పిల్లీ ఏం చేసిందో చూడండి
ABN , Publish Date - Apr 18 , 2024 | 05:07 PM
దుబాయిని(Dubai) గత 4 రోజులుగా వర్షాలు చుట్టు ముట్టాయి. భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరం నడిబొడ్డున ఓ కారు వరదలో చిక్కుకుపోయింది. ఓ పిల్లి వరదలో కొట్టుకువచ్చింది. ఈదలేక.. దేన్నైనా ఆసరాగా చేసుకోవాలని భావించింది.
దుబాయి: దుబాయిని(Dubai) గత 4 రోజులుగా వర్షాలు చుట్టు ముట్టాయి. భారీ వర్షాల ప్రభావంతో నగర వ్యాప్తంగా రహదారులు జలమయమయ్యాయి. అక్కడి పరిస్థితికి అద్దం పట్టే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరం నడిబొడ్డున ఓ కారు వరదలో చిక్కుకుపోయింది.
ఓ పిల్లి వరదలో కొట్టుకువచ్చింది. ఈదలేక.. దేన్నైనా ఆసరాగా చేసుకోవాలని భావించింది. అదే సమయానికి దానికి కారు డోరు ఆసరాగా దొరికింది. డోరును పట్టుకుని వస్తున్న వరదను చూస్తూ ఉండిపోయింది. ప్రాణాలు కాపాడుకోవాలనే దాని తాపత్రయం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
సదరు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు పడవపై వచ్చి దాన్ని రక్షించారు. ఈ ఘటన అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తోంది. నగరంలో భారీ వర్షం కారణంగా వరదలు పోటెత్తాయి. ప్రధాన వీధులు, ఇళ్లు, షాపింగ్ మాల్స్ జలమయమయ్యాయి.
AC Helmet: ట్రాఫిక్ పోలీసుల సమ్మర్ కష్టాలకు చెక్.. భలేగా ఏసీ హెల్మెట్.. విశేషాలివే
ఏప్రిల్ 16న ఒక్కరోజే యూఏఈలో సుమారు 259.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 75 ఏళ్ల గరిష్ట వర్షపాతం నమోదైందన్నమాట. నగరంలో చాలా చోట్ల మునిగిపోయిన కార్లు ఇతర వాహనాలు కనిపిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ప్రపంచలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది.
చాలా విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. మరికొన్ని రద్దయ్యాయి. ఇంకొన్నింటిని దారి మళ్లించారు. అత్యవసరమైతే తప్ప ఎయిర్‌పోర్ట్‌కి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.. మరికొన్నింటిని దారి మళ్లించామని ఎయిర్‌పోర్ట్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ అన్ని చెక్-ఇన్‌లను రద్దు చేసింది. యాక్సెస్ రోడ్లపై వరదలతో సిబ్బంది, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు వచ్చే వారం వరకు సెలవులు ప్రకటించారు. ఆసుపత్రుల ఎదుట మోకాళ్ల లోతు నీళ్లు నిలవడంతో.. రోగులకు వైద్య సేవలు అందడంలో తాత్సారం అవుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి