Share News

Chennai: పెంపుడు శునకానికి అంత్యక్రియలు.. ఇంటి వద్దే ఖననం

ABN , Publish Date - May 18 , 2024 | 12:04 PM

పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్‌ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్‌మేన్‌ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు.

Chennai: పెంపుడు శునకానికి అంత్యక్రియలు.. ఇంటి వద్దే ఖననం

చెన్నై: పదేళ్లపాటు అల్లారు ముద్దుగా పెంచిన శునకం మృతిచెందడంతో దిగులు చెందిన దాని యజమాని ఘనంగా అంత్యక్రియలు జరిపి ఇంటి వద్దే ఖననం చేసి తనకున్న జంతుప్రేమను చాటుకున్నారు. కదిర్‌ గ్రామం(Kadir village) ప్రాంతానికి చెందిన మది 2014లో డాబర్‌మేన్‌ రకానికి చెందిన శునకాన్ని కొనుగోలు చేసి, దానికి రెంబో అని పేరు పెట్టి పెంచాడు. ఆ శునకం మది కుటుంబ సభ్యులతో కలిసిమెలసి ఉండేది. కొద్ది రోజులకు ముందు ఆ శునకం తీవ్ర అనారోగ్యానికి గురైంది.


ఇదికూడా చదవండి: Heavy rains: మరో మూడు రోజులు భారీ వర్ష సూచన

వెటర్నరీ డాక్టర్లు ఎన్ని చికిత్సలు చేసినా ఫలితం లేక ఆకస్మికంగా మృతి చెందింది. దీంతో మది కుటుంబ సభ్యులంతా విలపించారు. ఆ తర్వాత ఆ శునకం పేరుతో ఆ ప్రాంతమంతా పోస్టర్లు వేయించారు. ఆ శునక కళేబరాన్ని పూలతో అలంకరించి పాడెమీద ఊరేగించిన తర్వాత ఇంటి వద్దే గోయి తవ్వి ఖననం చేశారు. పెంపుడు శునకంపై మది కుటుంబీకులు ప్రదర్శించిన జంతు ప్రేమ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వీడియోలు హల్‌చల్‌ అవుతోంది.

nani2.jpg


ఇదికూడా చదవండి: Hyderabad: ‘మెట్రో’లో మహిళలు తగ్గుతున్నారు..!

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 18 , 2024 | 12:07 PM