Viral: చైనాలో కొత్త ట్రెండ్.. ఆఫీస్ డెస్క్‌ల వద్ద ఆరటి పళ్లను పండిస్తున్న ఉద్యోగులు.. ఎందుకో తెలిస్తే..
ABN , Publish Date - Jun 07 , 2024 | 04:08 PM
ఆధునిక యుగంగలో అందరూ ఒత్తిడిని ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒత్తడిని జయించడానికి రకరకాల పద్ధతులు కూడా పుట్టుకొచ్చాయి. యోగా, మెడిటేషన్‌తో పాటు ఫిడ్జెట్ స్పిన్నర్లను కూడా స్ట్రెస్‌ను డీల్ చేయడానికే వాడుతుంటారు. ప్రస్తుతం ఈ ఒత్తిడికి చైనా ఉద్యోగులు మరో కొత్త ఉపశమనాన్ని కనిపెట్టారు.
ఆధునిక యుగంగలో అందరూ ఒత్తిడిని (Stress) ఎదుర్కోక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఒత్తడిని జయించడానికి రకరకాల పద్ధతులు కూడా పుట్టుకొచ్చాయి. యోగా, మెడిటేషన్‌తో పాటు ఫిడ్జెట్ స్పిన్నర్లను కూడా స్ట్రెస్‌ను డీల్ చేయడానికే వాడుతుంటారు. ప్రస్తుతం ఈ ఒత్తిడికి చైనా (Chian) ఉద్యోగులు మరో కొత్త ఉపశమనాన్ని కనిపెట్టారు. ఆఫీస్ డెస్క్‌ల వద్ద అరటిపళ్లను (Bananas) పండిస్తే స్ట్రెస్ కాస్త తగ్గుముఖం పడుతుందని వారి (Chinese employees) అనుభవంలో తేలిందట. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన జియాహోంగ్షులో (Xiaohongshu) ఈ ట్రెండ్ బాగా ఊపందుకుంటోంది.
అరటిపళ్లను పండించడం అంటే కాయలను పక్వానికి తీసుకురావడం. ఈ ఐడియాకు చైనా ఇన్‌స్టాగ్రామ్ వెర్షన్ అయిన జియాహోంగ్షులో మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటివరకు 22 వేలకు పైగా లైక్‌లను సంపాదించింది. ఇందు కోసం ముందుగా కాండంతో ఉన్న ఆకు పచ్చని అరటిపళ్లను కొంటారు.ఆఫీస్‌లోని తమ డెస్క్‌ల మీద ఓ పాత్రలో నీళ్లు పోసి అందులో ఆ పచ్చి అరటిపళ్లను ఉంచి కాస్త జాగ్రత్తలు తీసుకుంటారు. వారం తిరిగేసరికల్లా ఆ పచ్చి అరటి పళ్లు పండిపోతాయి. ఈ ట్రెండ్‌ను ``స్టాప్ బనానా గ్రీన్`` (stop banana green) అని పిలుస్తున్నారు.
ఆకు పచ్చని అరటి పళ్లు బంగారు రంగులోకి మారే ప్రక్రియను చూడడం ఒత్తిడిని దూరం చేస్తుందని చైనా ఉద్యోగులు నమ్ముతున్నారు. ఈ ప్రక్రియ ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వడమే కాకుండా రోజువారీ పని ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. ఆకుపచ్చ నుంచి బంగారు పసుపు వరకు, ఈ ప్రక్రియ ప్రతి క్షణం అంతులేని ఆశ, ఆశ్చర్యంతో నిండి ఉంటుంది. ఈ ట్రెండ్ బాగా పెరిగిపోవడంతో చైనాలోని వందలాది దుకాణాలు ఇప్పుడు ప్రత్యేకంగా అరటికాయలను ఈ ప్రయోజనం కోసమే విక్రయిస్తున్నాయట.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ టెక్నాలజీ చూసి టిమ్ కుక్ షాకవడం ఖాయం.. పగిలిపోయిన స్క్రీన్‌తో ఏం చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..