Share News

Viral Video: దారికి అడ్డుగా పడుకున్న ఎలిగేటర్లను.. ఈ సైక్లిస్టు ఎలా దాటుకెళ్లాడో చూస్తే..

ABN , Publish Date - May 10 , 2024 | 04:33 PM

మొసళ్లు, ఎలిగేటర్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చనిపోయినట్లుగా నటించి.. సమీపానికి వచ్చే జంతువులపై మెరుపువేగంతో దాడి చేస్తుంటాయి. ఒక్కసారి వాటి నోటికి చిక్కిన జంతువు.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే...

Viral Video: దారికి అడ్డుగా పడుకున్న ఎలిగేటర్లను.. ఈ సైక్లిస్టు ఎలా దాటుకెళ్లాడో చూస్తే..

మొసళ్లు, ఎలిగేటర్లు ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చనిపోయినట్లుగా నటించి.. సమీపానికి వచ్చే జంతువులపై మెరుపువేగంతో దాడి చేస్తుంటాయి. ఒక్కసారి వాటి నోటికి చిక్కిన జంతువు.. ఇక తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. అందుకే అవి ఎదురుపడ్డాయంటే.. ఎలాంటి జంతువైనా ఆమడదూరం పారిపోతుంది. మొసళ్లకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. రెండు ఎలిగేటర్లు దారికి అడ్డుగా పడుకున్నాయి. అటుగా వెళ్తున్న సైక్లిస్టు.. చివరకు ఏం చేశాడో చూడండి..


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలో (Florida) ఈ ఘటన చోటు చేసుకుంది. వాల్ట్ అనే సైక్లిస్టుకు (Cyclist) షాకింగ్ అనుభవం ఎదురవుతుంది. ఓ రోజు అతను రోడ్డుపై వెళ్తుండగా.. దారి మధ్యలో రెండు ఎలిగేటర్లు (Alligators) పడుకుని ఉంటాయి. చూసేందుకు అవి చనిపోయినట్లుగా ఉంటాయి. సైక్లిస్టు కూడా మొదట అలాగే అనుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్లగా వాటిలో ఒకటి వెంటనే అటూ, ఇటూ కదిలింది. దీంతో షాకైన ఆ వ్యక్తి.. కాసేపటి తర్వాత సైకిల్ ముందు టైరుతో ఎలిగేటర్‌ను పక్కకు నెట్టేస్తాడు. దీంతో అది భయంతో సడన్‌గా రోడ్డు పక్కకి వెళ్లిపోతుంది. అయినా ఆ వ్యక్తి ఎందుకైనా మంచిదని, సైకిల్ నుంచి కిందకు దిగుతాడు.

Viral Video: పెళ్లి వేదికపైకి దూసుకొచ్చి వరుడికి షాక్ ఇచ్చిన యువకుడు.. చివరకు..


సైకిల్‌కు ఇటు వైపు నిల్చుని తోసుకుంటూ వెళ్తాడు. దీంతో కదలకుండా పడి ఉన్న మరో ఎలిగేటర్ కూడా పక్కకు జరుగుతుంది. ఇలా ఎంతో తెలివిగా వాటి నుంచి తప్పించుకుని వెళ్లిపోతాడు. ఇదిలావుండగా, ఫ్లోరిడాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణంగా జరుగుతుంటాయి. మొసళ్లు ఇళ్లల్లోకి ప్రవేశించే ఘటనలు కూడా తరచూ చూస్తూ ఉంటాం. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ‘‘ఈ ఎలిగేటర్లు చనిపోయినట్లు భలే నటిస్తు్న్నాయి’’.. అంటూ కొందరు, ‘‘ఈ సైక్లిస్టు.. చాలా స్మార్ట్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం పది వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తాబేళ్లకు ఆహారం వేస్తున్న యువతికి షాక్.. ఉన్నట్టుండి ఏం జరిగిందో చూస్తే..

Updated Date - May 10 , 2024 | 04:33 PM