Share News

Viral News: మీ కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా.. ఇది దేనికి సంకేతమో మీకు తెలుసా..

ABN , Publish Date - Mar 12 , 2024 | 10:05 PM

కలలు కనడం చాలా సాధారణ విషయం. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. జంతువులు సైతం కలలు కంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు నడిపిస్తుందట.

Viral News: మీ కలలో దెయ్యాలు కనిపిస్తున్నాయా.. ఇది దేనికి సంకేతమో మీకు తెలుసా..

కలలు కనడం చాలా సాధారణ విషయం. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు ప్రతి ఒక్కరికీ కలలు వస్తుంటాయి. జంతువులు సైతం కలలు కంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కల మనల్ని భవిష్యత్తు సంఘటనల వైపు నడిపిస్తుందట. భవిష్యత్ లో జరగాల్సిన విషయాలను కొన్ని సంకేతాల రూపంలో ముందే హెచ్చరిస్తుంది. అందుకే మెలకువ వచ్చాక కూడా కొన్ని కలలు (Dreams) మనల్ని వెంటాడుతూ ఉంటాయి. కొన్ని కలలు మాత్రం చాలా భయానకంగా ఉంటాయి. వాటి గురించి ఆలోచించాలనే తలపే మనల్ని భయకంపితుల్ని చేస్తుంది. కలలో చాలా సార్లు దెయ్యాలు కనిపిస్తుంటాయి. అయితే.. కలలో దెయ్యాలు కనిపించడం దేనికి సంకేతమో మీకు తెలుసా..

డ్రీమ్ సైన్స్ ప్రకారం కలలో దెయ్యాలను కనిపించడం మంచిది కాదు. ఇవి చెడుకు ప్రత్యామ్నాయంగా ఉంటాయి. ఎందుకంటే దెయ్యాలు నెగెటివ్ ఎనర్జీకి చిహ్నాలు కాబట్టి చెడు శకునానికి సంకేతం. మీకు తరచుగా దెయ్యం కనపడితే మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారని అర్థం. మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడే దెయ్యం కలలు వస్తాయి. కొన్నిసార్లు మీరు చాలా ఎమోషనల్‌గా ఉన్నప్పుడు లేదా ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టినప్పుడు భావోద్వేగానికి గురైన సమయంలో వచ్చే కలల్లోనూ దెయ్యాలు కనిపిస్తాయి.


దెయ్యం మీపై దాడి చేస్తున్నట్లు కల వస్తే మీ మనస్సులో ఏదో ఒకటి సాధించకుండా అడ్డుకుంటున్నట్లు సూచిస్తుంది. విజయానికి దూరంగా ఉంటారని దీని అర్థం. భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే దెయ్యం కలలు వస్తాయి. ఆర్థిక నష్టాన్ని, బాధలు, నిరాశకు సూచనలుగా దెయ్యాల కలలు అప్రమత్తం చేస్తాయి. కలలో దెయ్యం గాలిలో ఎగురుతున్నట్లు వస్తే శత్రువు మీకు హాని చేస్తాడని అర్థం.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 12 , 2024 | 10:05 PM