Share News

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..

ABN , Publish Date - Jul 21 , 2024 | 04:50 PM

జంతువులు కొన్నిసార్లు మనుషుల తరహాలో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అడవుల్లో అద్దం ఏర్పాటు చేస్తే.. దాని ముందుకు వచ్చిన అనేక జంతువులు తమను తాము చూసుకుని అనేక రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చూస్తుంటాం. ప్రస్తుతం...

Viral Video: గోడపై గాడిద పెయింటింగ్.. నిజమని నమ్మిన ఈ గాడిద.. దగ్గరికి వెళ్లి..

జంతువులు కొన్నిసార్లు మనుషుల తరహాలో విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. అడవుల్లో అద్దం ఏర్పాటు చేస్తే.. దాని ముందుకు వచ్చిన అనేక జంతువులు తమను తాము చూసుకుని అనేక రకాల ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం చూస్తుంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి అనేక వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఓ గాడిద వీడియో తెగ వైరల్ అవుతోంది. గోడపై గాడిద పెయింటింగ్ చూసిన ఓ గాడిద దగ్గరికి వెళ్లి విచిత్రంగా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.


సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. రోడ్డుపై వెళ్తున్న ఓ గాడిదకు మార్గ మధ్యలో గోడపై (donkeys painting on the wall) రెండు గాడిదల పెయింటింగ్ కనిపిస్తుంది. ఆ పెయింటింగ్‌లో గాడిదలు నీటిలోంచి తల బయటకు పెట్టి నీటి ఒడ్డుకు వచ్చేందుకు ప్రయత్నిస్తు్నట్లు కనిపిస్తుంది. దీన్ని చూసిన గాడిద మెల్లగా ఆ పెయింటింగ్ వద్దకు వెళ్తుంది.

Viral Video: రైతు ఇంట్లోకి దూరిన సింహాల గుంపు.. చివరకు వర్షంలో వాటి నిర్వాకం చూస్తే..


రెండు గాడిదల చిత్రాలను చూసి భావోద్వేగానికి గురవుతుంది. వాటికి ముద్దులు పెడుతూ (Donkey kissing pictures of donkeys) ఎక్కడ లేని ప్రేమను కనబరుస్తుంది. ప్రమాదంలో ఉన్న వాటికి సాయం చేసినట్లుగా చాలా సేపు ఆ గాడిద చిత్రాల వద్దే నిల్చుని తల ఆనిస్తూ ఉంటుంది. ‘‘నీటిలోంచి బయటికి వచ్చేయండి మిత్రాలారా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తుంది. ఇలా ఆ గాడిద చేసిన నిర్వాకం చూసి అక్కడున్న వారంతా అవాక్కవుతారు.

Viral Video: సీన్ రివర్స్ అంటే ఇదేనేమో.. గేదెలను చూసి పారిపోయిన సింహం.. చివరకు..


ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ గాడిద మనసు ఎంతో గొప్పది’’.. అంటూ కొందరు, ‘‘కష్టాల్లో ఉన్న గాడిదలకు సాయం చేసినట్లుగా ఉంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: యువతికి షాకింగ్ లవ్ ప్రపోజల్.. చివరికి ఆమెను ఎలా ఒప్పించాడో చూస్తే..

Updated Date - Jul 21 , 2024 | 04:50 PM