Share News

Trending: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం ఎఫెక్ట్.. కంపించిన దృశ్యాలు మీరు చూశారా..

ABN , Publish Date - Apr 06 , 2024 | 03:00 PM

అమెరికా ( America ) లోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం భూకంపం సంభవించిది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి.

Trending: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి భూకంపం ఎఫెక్ట్.. కంపించిన దృశ్యాలు మీరు చూశారా..

అమెరికా ( America ) లోని న్యూయార్క్ నగరంలో శుక్రవారం భూకంపం సంభవించిది. ఫిలడెల్ఫియా నుంచి న్యూయార్క్, తూర్పున లాంగ్ ఐలాండ్ వరకు శుక్రవారం ఉదయం భూ ప్రకంపనలు సంభవించాయి. 4.8 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటిని ఇళ్లూ, భవనాలు, కట్టడాలు కంపించాయి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ పై సైతం భూకంపం ప్రభావం పడింది. న్యూయార్క్ నగరానికి పశ్చిమాన 64 కిలోమీటర్ల దూరంలోని సెంట్రల్ న్యూజెర్సీలోని టెక్స్‌బరీలో భూకంప కేంద్రాన్ని 4.7 కిలోమీటర్ల లోతులో అధికారులు గుర్తించారు. ఈ మేరకు యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వివరాలు వెల్లడించింది.

Nara Bhuvaneshwari: వైసీపీ వేధింపులకు అమాయకుల ప్రాణాలు పోతున్నాయ్.. నారా భువనేశ్వరి..


మన్‌హట్టన్, బ్రూక్లిన్లతో పాటు బాల్టిమోర్, ఫిలడెల్ఫియా, కనెక్టికట్, తూర్పు కోస్తాలోని ఇతర ప్రాంతాల వారు సైతం ప్రకంపనలను గుర్తించారు. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదని న్యూయార్క్ నగర అత్యవసర సేవల విభాగం పేర్కొంది. కాగా ఈ సమయంలో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంపించిన దృశ్యాలు అక్కడ ఉన్న కెమెరాలో రికార్డ్ అయ్యాయి. భూకంపం ధాటికి లిబర్టీ విగ్రహం కదులుతున్న వీడియో చూస్తుంటే భూకంపం తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది.

Kejriwal: కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్.. ఎఫ్ఐఆర్ ను తిరస్కరించిన కోర్టు..


మరోవైపు భూకంపంపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీతో మాట్లాడానని, అవసరమైన సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2011లో వర్జీనియాలో 5.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత అతిపెద్ద భూకంపం ఇదే కావడం గమనార్హం.

మరిన్ని ప్రత్యేకం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 05:15 PM