Electricity Bill Scam: పాపం.. విద్యుత్ బిల్లు అతన్ని నిండా ముంచింది.. రూ.1.85లక్షలు ఎలా మోసపోయాడంటే..!
ABN , Publish Date - Apr 03 , 2024 | 02:14 PM
తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో కరెంట్ బిల్లుకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకుని ఏకంగా రూ. 1.85 లక్షలు మోసపోయాడు.
ఎన్నో రకాల నగదు చెల్లింపులన్నీ ఎలాంటి కష్టం లేకుండా ఆన్లైన్లో చక్కబెట్టేస్తున్న కాలమిది. కాలు కదపకుండానే వేలు, లక్షల ఆర్థిక లావాదేవీలు మొబైల్ ఫోన్ నుండే జరుపుతుంటారు. అన్నీ ఇలా ఆన్లైన్ లో చక్కబెట్టడం సైబర్ నేరగాళ్లకు కూడా బాగా కలిసొస్తోంది. ఎలా కుదిరితే అలా.. ఏదో ఒక రూపంలో ప్రజలను మోసం చేసి లక్షలాది రూపాయలను ఈజీగా దోచేసుకుంటున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి ఆన్లైన్లో కరెంట్ బిల్లుకు సంబంధించిన స్కామ్ లో చిక్కుకుని ఏకంగా రూ. 1.85 లక్షలు మోసపోయాడు. అసలేంటీ కరెంట్ బిల్ స్కామ్.. దీని వల్ల బ్యాంకు ఖాతాలలో డబ్బు ఎలా దోచేస్తారు? వివరంగా తెలుసుకుంటే ఎంతో మంది ఈ స్కామ్ గురించి అవగాహన పెంచుకుని దీనికి దూరంగా ఉంటారు.
కరెంట్ బిల్లు స్కామ్..
సాధారణంగా ప్రతి నెలా కరెంట్ బిల్లు కట్టడం కామన్. అయితే దీన్ని ఆసరా చేసుకుని సైబర్ నేరగాళ్లు కొత్త వ్యూహం పన్నుతున్నారు. మీరు కరెంట్ బిల్లు వెంటనే చెల్లించాలి. లేకపోతే మీ కనెక్షన్ తొలగించబడుతుంది అంటూ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు పంపినట్టు మెసేజ్ లు పంపుతున్నారు. కనెక్షన్ తొలగించకూడదు అంటే వెంటనే కింది లింక్ సహాయంతో కరెంట్ బిల్లు చెల్లించండి అంటూ ఒక లింక్ ను కూడా సదరు మెసేజ్ కు అనుబంధంగా పంపుతున్నారు. కరెంట్ కనెక్షన్ ఎక్కడ తొలగిస్తారో అనే కంగారులో ఆ లింక్ ను ఉపయోగించి కరెంట్ బిల్లు కడితే ఆ తరువాత సైబర్ నేరగాళ్లు మొబైల్ ఫోన్ ను హ్యాక్ చేసి బ్యాంక్ ఖాతా యాక్సెస్ తీసుకుని ఖాతాలో ఉన్న నగదు మొత్తం స్వాహా చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఐస్ క్రీం తిన్న తరువాత పొరపాటున కూడా ఇవి తినకండి!
తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ మోసంలో చిక్కుకున్నాడు. అతని మొబైల్ కు కరెంట్ బిల్లు కట్టకపోతే కనెక్షన్ తొలగిస్తామంటూ ఒక మెసేజ్ వచ్చింది. అది ఎలక్ట్రిసిటీ డిపార్మెంట్ నుండి అనుకుని అతను కంగారు పడ్డాడు. మెసేజ్ అనుబంధంగా ఉన్న లింక్ ఉపయోగించి కరెంట్ బిల్ చెల్లించాడు. అంతే అతని ఖాతాలో ఉన్న రూ. 1.85లక్షలు మాయమయ్యాయి. ఇలాంటి మెసేజ్ ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని వైరల్ వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.