Share News

Viral Video: ఏనుగు ముందు పిల్ల చేష్టలు చేస్తే అలాగే ఉంటుంది మరి.. రోడ్డుపై ఏనుగు ఏం చేసిందో చూడండి..

ABN , Publish Date - Jun 05 , 2024 | 04:43 PM

అడవులను నరికేసి వాటి మధ్య గుండా రోడ్లు వేసెయ్యడం వల్ల వన్య ప్రాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిండి లేక, ఆవాసాలు లేక, రక్షణ లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతుండడం మరింత సమస్యగా మారింది.

Viral Video: ఏనుగు ముందు పిల్ల చేష్టలు చేస్తే అలాగే ఉంటుంది మరి.. రోడ్డుపై ఏనుగు ఏం చేసిందో చూడండి..
Wild Elephant

అడవులను (Forest) నరికేసి వాటి మధ్య గుండా రోడ్లు వేసెయ్యడం వల్ల వన్య ప్రాణాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. తిండి లేక, ఆవాసాలు లేక, రక్షణ లేక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. వాటి స్వేచ్ఛకు భంగం కలుగుతుండడం మరింత సమస్యగా మారింది. రోడ్లు దాటుతున్నప్పుడు వాహనాల వల్ల జంతువులు ప్రమాదాలకు గురి కావడం లేదా జంతువుల (Wild Animals) వల్ల మనుషులు ఇబ్బందులు పడడం తరచుగా జరుగుతోంది. అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


wildtrails.in అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో అడవి గుండా వేసిన ఓ రోడ్డుపై కార్లు వెళుతున్నాయి. మార్గమధ్యంలో ఓ అడవి ఏనుగు (Elephant) రోడ్డుపై నిల్చుని ఉంది. అది వెళ్లే వరకు వారు ఆగకుండా ఆ ఏనుగును తరిమేందుకు ప్రయత్నించారు. గట్టిగా కేకలు వేస్తూ దానిని బెదిరించేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ఏనుగుకు కోపం వచ్చింది. ఆ కార్లను నెట్టడానికి ప్రయత్నించింది. కేకలు వేస్తున్న వ్యక్తులను తరిమింది. వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టారు (Elephant Videos).


కొంతసేపటి తర్వాత ఆ ఏనుగు తనంతట తానుగా శాంతించి రోడ్డు దిగి అడవిలోకి వెళ్లిపోయింది. దీంతో ఆ వ్యక్తులు నెమ్మదిగా తమ వాహనాల దగ్గరకు వెళ్లారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 57 వేల మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``అడవిని శాసించేది మనుషులు కాదు``, ``ఆ జంతువులతో పోలిస్తే ఏనుగు చాలా ప్రశాంతంగా వ్యవహరించింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral video: ఆ సింహాలకు ఎంత అవమానం?.. రోడ్డు మీద పడుక్కున్న రెండు సింహాల మధ్య నుంచి ఎలా వెళ్లాడో చూస్తే..


Viral Video: నాగుపాము ముందు హీరోయిజం చూపిద్దామనుకుంటే అలాగే ఉంటుంది.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2024 | 04:43 PM