Elon Musk: ఈ విషయంలో యుద్ధానికీ సిద్ధమే.. హెచ్-1బీ వీసాపై ఎలాన్ మస్క్ స్పందన
ABN , Publish Date - Dec 30 , 2024 | 09:40 AM
హెచ్-1బీ వీసా అమెరికాకు ఎంతో అవసరమని ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీన్ని పరిరక్షించేందుకు తాను యుద్ధానికైనా సిద్ధమని తేల్చి చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో విదేశీ వృత్తి నిపుణులు ఉద్యోగాలు చేసుకునేందుకు ఉపకరించే హెచ్-1బీ వీసాపై అమెరికాలో రగడ కొనసాగుతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ఈ వీసాకు మద్దతుగా నిలుస్తుండగా ట్రంప్ సపోర్టర్లు మాత్రం తీవ్రంగా విభేదిస్తున్నారు. అమెరికన్లకు ఉద్యోగాలు రాకుండా చేస్తున్న ఈ వీసా విషయంలో పునరాలోచించాలని ట్రంప్ మద్దతుదారులు పట్టుబడుతున్నారు. ఈ వీసా పేరిట తక్కువ జీతంలో విదేశీయులను నియమించుకునే తీరుకు బ్రేకులు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ అమెరికా పురోగతికి హెచ్-1బీ వీసా అవసరమని వాదిస్తున్న ఎలాన్ మస్క్..ఈ విషయంలో యుద్ధానికైనా సిద్ధమేనంటూ తొడగొడుతున్నారు (Elon Musk).
Donald Trump: మస్క్ ఎప్పటికీ అమెరికా అధ్యక్షుడు కాలేరు: డొనాల్డ్ ట్రంప్
గతంలో ఎలాన్ మస్క్ చేసిన ఓ వ్యాఖ్యను ప్రస్తావిస్తూ ఇటీవల స్టీవెన్ మాకీ అనే అమెరికన్ కంపోజర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వ్యర్థమైన వాటిని మెరుగుపరిచేందుకు ప్రయత్నించొద్దని మస్క్ గతంలో అన్న వ్యాఖ్యలు ప్రస్తావించిన ఆయన మస్క్ ఇప్పుడు హెచ్-1బీ వీసా విధానంలో సంస్కరణలకు ప్రయత్నిస్తున్నారంటూ దెప్పి పొడిచారు. ఈ పోస్టుపై అగ్గిమీద గుగ్గిలమైన మస్క్ తీవ్రంగా స్పందించారు.
Technology: భారత ఎక్స్ యూజర్లకు.. ఎలాన్ మస్క్ షాక్..
‘‘నేను స్పేస్ ఎక్స్, టెస్లాను ఏర్పాటు చేశా. ఇలాంటి అనేక సంస్థలను ఎందరో అమెరికాకు వలసొచ్చి ఏర్పాటు చేశారు. ఇవన్నీ అమెరికాను శక్తిమంతం చేశాయి. నాతో సహా ఇలాంటి వారందరూ అమెరికాకు రాగలిగారంటే దానికి హెచ్-1బీ వీసానే కారణం. కాబట్టి..నువ్వు కాస్త వెనక్కు తగ్గు. దీన్ని నీలాంటి వాళ్లు అస్సలు అర్థం చేసుకోలేరు. హెచ్-1బీ వీసా కోసం నేను యుద్ధానికైనా సిద్ధమే’’ అంటూ దబిడిదిబిడిలాడించారు.
Donald Trump: ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి జిన్‌పింగ్!
అయితే, అమెరికా వలస విధానం లోపభూయిష్టంగా ఉందని అంగీకరించిన మస్క్ దీనిలో సంస్కరణలు తీసుకురావాలని అన్నారు. వలసల విధానం దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు మార్పులు కావాలని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా రెండు కీలక సూచనలు కూడా చేశారు. హెచ్-1బీ వీసా ఉన్న వారికి ఇచ్చే కనిష్ఠ జీతాన్ని పెంచాలని సూచించారు. అంతేకాకుండా, ఈ వీసా నిర్వహణ ఖర్చు కోసం విదేశీయుల నుంచి ఏటా కొంత మొత్తాన్ని రుసుము కింద తీసుకోవాలని కూడా సూచించారు. ఈ రెండు చాలా సులభమైన పరిష్కారాలని, వీటి వల్ల వలసల వ్యవస్థతో అమెరికాకు ప్రయోజనాలు చేకూరతాయని చెప్పుకొచ్చారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హెచ్-1బీ వీసాకు మద్దతు ప్రకటించారు.
Read Latest and International News