Viral Video: Viral Video: ఎలన్ మస్క్ వీడియో.. నెట్టింట రచ్చ రచ్చ..!
ABN , Publish Date - Aug 16 , 2024 | 02:00 PM
Viral Video: ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్.. టెక్నాలజీలో ఎలన్ మస్క్.. ఇద్దరూ తోపులే. అదే సమయంలో వారిద్దరూ చేసే బోల్డ్ కామెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఎక్స్ వేదికగా ఎలన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు బిగ్ డిస్కషన్‌గా మారింది.
Viral Video: ప్రపంచ రాజకీయాల్లో డొనాల్డ్ ట్రంప్.. టెక్నాలజీలో ఎలన్ మస్క్.. ఇద్దరూ తోపులే. అదే సమయంలో వారిద్దరూ చేసే బోల్డ్ కామెంట్స్, వివాదాస్పద వ్యాఖ్యలు.. ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాయో మనందరికీ తెలిసిందే. తాజాగా ఎక్స్ వేదికగా ఎలన్ మస్క్ షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు బిగ్ డిస్కషన్‌గా మారింది. ఆ వీడియోలో ఎలన్ మస్క్, ట్రంప్ ఉండటమే ఈ డిస్కషన్‌కు కారణంగా. ఎలన్ మస్క్ ఇంతకీ ఏం వీడియో షేర్ చేశాడు? ఆ వీడియోలో ఏముంది? పూర్తి కథనం మీకోసం..
వారిని ప్రేమించండి లేదా ద్వేషించండి, ఎలోన్ మస్క్ మరియు డొనాల్డ్ ట్రంప్ తమ బోల్డ్ మరియు తరచుగా వివాదాస్పద ప్రకటనలతో ముఖ్యాంశాలు చేయడం కొత్తేమీ కాదు. అయితే ఈసారి టెక్ బిలియనీర్ సోషల్ మీడియాలో తన లేటెస్ట్ పోస్ట్‌తో జనాలు తలలు పట్టుకుంటున్నారు.
నవంబర్ 5వ తేదీన అమెరికాలో ఎన్నికలు జరుగనున్నాయి. రిపబ్లికన్ పార్టీ తరఫున డొనాల్డ్ ట్రంప్ పోటీలో నిలిచారు. ఆయనకు టెక్ టైకూన్ ఎలన్ మస్క్ ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఆయనకు మద్ధతుగా ప్రకటనలు చేయడమే కాదు.. ట్రంప్ ప్రచారానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. అయితే, తాజాగా మస్క్ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో పాప్ సాంగ్‌కి ట్రంప్, ఎలన్ మస్క్ ఇద్దరూ డ్యాన్స్ వేస్తున్నట్లుంది. వాస్తవానికి ఇది ఏఐ టెక్నాలజీతో రూపొందించిన వీడియో. ఈ వీడియోను పోస్ట్ చేసిన ఎలన్ మస్క్.. ‘ద్వేషించేవారు ఇది AI అని చెబుతారు’ అని క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ట్రంప్, మస్క్ సంయుక్తంగా డ్యాన్స్ వేస్తున్నట్లు ఉన్న ఈ వీడియోకు నెటిజన్ల నుంచి భారీగా స్పందన వస్తోంది. ఆగష్టు 14న వీడియో పోస్ట్ చేయగా.. ఇప్పటి వరకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ట్రంప్ సైతం..
మస్క్ పోస్ట్ చేసిన వీడియోనే.. అమెరికా మాజీ అధ్యక్షుడు, మరోసారి అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ కూడా పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కి 30 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
మస్క్, ట్రంప్ మధ్య సంబంధం..
ఎలన్ మస్క్, డొనాల్డ్ ట్రంప్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. వీరిద్దరూ అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కనబరిచేవారు. స్పేస్ ఫోర్స్, ఇమ్మిగ్రేషన్ విధానాల విషయంలోనూ ట్రంప్‌కి సపోర్ట్ చేస్తూ వచ్చారు మస్క్. ఇటీవల ఎక్స్ వేదికగా డొనాల్డ్ ట్రంప్‌ను మస్క్ ఇంటర్వ్యూ కూడా చేశారు. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నాన్ని మస్క్ ఖండించారు. ట్రంప్‌కి సపోర్ట్ ప్రకటించారు.