Share News

Viral Video: హైనాను హడలెత్తించిన గాడిద.. వీడియో చూస్తే షాకే..

ABN , Publish Date - Oct 03 , 2024 | 01:49 PM

Latest Viral Video: భూమిపై అయినా.. నీటిలో అయినా.. బలవంతుడిదే విజయం అంటారు. అడవీ ప్రపంచం విషయానికి వస్తే.. వైల్డ్ లైఫ్ ప్రపంచంలో ఒకే ఒక నియమం ఉంటుంది. బలమైన జీవాలే అడవిలో జీవనం సాగించగలుగుతాయి. లేదంటే.. మరో జీవికి ఆహారం అవుతాయి. అందుకే.. అత్యంత బలమైన సింహానికి మిగతా జీవులు దూరంగా ఉంటాయి.

Viral Video: హైనాను హడలెత్తించిన గాడిద.. వీడియో చూస్తే షాకే..
Fight Between Hyena and Donkey

Latest Viral Video: భూమిపై అయినా.. నీటిలో అయినా.. బలవంతుడిదే విజయం అంటారు. అడవీ ప్రపంచం విషయానికి వస్తే.. వైల్డ్ లైఫ్ ప్రపంచంలో ఒకే ఒక నియమం ఉంటుంది. బలమైన జీవాలే అడవిలో జీవనం సాగించగలుగుతాయి. లేదంటే.. మరో జీవికి ఆహారం అవుతాయి. అందుకే.. అత్యంత బలమైన సింహానికి మిగతా జీవులు దూరంగా ఉంటాయి. అడవిలో రకరకాల క్రూర మృగాలు ఉంటాయి. తమకన్నా చిన్న జీవులను వేటాడి తిని తమ కడుపును నింపుకుంటాయి. సింహం, పులి, మొసలి, హైనా, చిరుతపులి వంటి జీవులు.. ఇతర జీవులను వేటాడి తినేస్తాయి. తాజాగా ఓ హైనా, గాడిదకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


వాస్తవానికి హైనా చాలా ప్రమాదకారి. చూసేందుకు చిన్న జీవిగానే కనిపించినా.. అవకాశం దొరికితే సింహంపైనే అటాక్ చేసే స్థాయిలో ఉంటుంది. అలాంటి హైనాను ఓ గాడిద ముప్పుతిప్పలు పెట్టింది. హైనాకు గట్టి షాకే ఇచ్చింది. ఈ వీడియో ప్రకారం.. గాడిద, హైనా రెండూ ఎదురుపడ్డాయి. దీంతో గాడిదపై దాడి చేసేందుకు హైనా ప్రయత్నించింది. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. గాడిద తన బలాన్ని ప్రదర్శించింది. హైనాపై రివర్స్ అటాక్ చేసింది. తన నోటితో హైనాను కొరుకుతూ తీవ్రంగా గాయపరిచింది. దీంతో బిత్తరపోయిన హైనా.. దిక్కుతోచని నిస్సహాయ స్థితికి చేరింది. హైనా కూడా రివర్స్ అటాక్ చేసే ప్రయత్నం చేయగా.. గాడిద ఆ చాన్స్ ఇవ్వలేదు.


ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా @AMAZlNGNATURE అకౌంట్‌లో పోస్ట్ చేశారు. దీంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది. వీడియోను చూసిన నెటిజన్లు అవాక్కవతున్నారు. అడవీ ప్రపంచంలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం చాలా కష్టం అని పేర్కొంటున్నారు. ప్రత్యర్థిని ఎదురించి బతకాలంటే బలంతోపాటు.. ధైర్యం కూడా ఉండాలని.. ఆ గాడిద తన బలంతోపాటు, ధైర్యాన్ని కూడా ప్రదర్శించిందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరెందుకు ఆలస్యం.. ఈ స్టన్నింగ్ వీడియోను మీరూ చూసేయండి.

Updated Date - Oct 03 , 2024 | 01:49 PM